• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • MANGO SPECIAL TRAIN ARRIVES IN DELHI FROM ANDHRA PRADESH MK GH

Mango special train: విజయనగరం నుంచి ఢిల్లీ చేరిన మ్యాంగో స్పెషల్ ట్రైన్

Mango special train: విజయనగరం నుంచి ఢిల్లీ చేరిన మ్యాంగో స్పెషల్ ట్రైన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మామిడి పండ్ల రవాణాకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల విజయనగరం నుంచి వీటిని ఢిల్లీకి రవాణా చేసేందుకు ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్ తాజాగా ఢిల్లీ చేరుకుంది.

  • Share this:
కాలానుగుణంగా లభించే అన్ని రకాల పండ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. వేసవి వచ్చిందంటే అన్ని ప్రాంతాల్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మామాడి పండ్లను తింటారు. అయితే భారత్‌లో అన్ని ప్రాంతాల్లో మామాడి పండ్లు లభించవు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే మామిడి తోటలు విరివిగా ఉంటాయి. అక్కడి నుంచి పండ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మామిడి పండ్ల రవాణాకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల విజయనగరం నుంచి వీటిని ఢిల్లీకి రవాణా చేసేందుకు ప్రత్యేకంగా ఒక రైలును ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్ తాజాగా ఢిల్లీ చేరుకుంది.

ఈ సంవత్సరం మొదటి స్పెషల్ మ్యాంగో ట్రైన్‌ శుక్రవారం ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం మామిడి పండ్లను తరలించేందుకే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రైలు ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ట్రైన్‌లో మొత్తం 200 టన్నుల మామిడి పండ్లు ఉన్నాయి. వీటిని 11,600 పెట్టెల్లో ప్యాక్ చేశారు. విజయనగరం జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తికి కేంద్రంగా పేరు గాంచింది. ఉత్తరాంధ్ర నుంచి వివిధ ప్రాంతాలకు, రైళ్లలో ఉత్తర భారతానికి పండ్లను రవాణా చేస్తారు.

ఏర్పాటు చేసిన వాల్తేర్ రైల్వే డివిజన్
ఈ స్పెషల్ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. మామిడి రైతులు, వ్యాపారుల కోసం వాల్తేరు డివిజన్ ప్రత్యేక పార్సిల్ రైలు సేవలను నడుపుతోందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, ఈ డివిజన్ నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తుందని చెప్పారు.

వేరే పండ్ల రవాణా కూడా..
రైల్వే శాఖ ఇంతకు ముందు ఇతర పండ్లను కూడా ఇలా ప్రత్యేక రైళ్లలో రవాణా చేసింది. గతంలో నారింజ పండ్ల రవాణా కోసం స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత సపోట, అరటిపండ్లు, మామిడి పండ్ల కోసం సేవలు విస్తరించారు. ఇతర ప్రాంతాలకు తరలించిన పండ్లను వ్యాపారులు రైల్వే యార్డ్ నుంచి ట్రక్కుల ద్వారా వారి గోడౌన్లకు రవాణా చేస్తుంటారు. అక్కడి నుంచి వివిధ దుకాణాలకు, చిరు వ్యాపారులకు, వారి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లు చేరుతాయి.
First published:

అగ్ర కథనాలు