వరల్డ్ బ్యాంక్ సీఎఫ్‌ఓగా భారతీయ మహిళ

‘అన్షులా కాంత్‌ను వరల్డ్ బ్యాంక్ ఎండీ - సీఎఫ్‌ఓగా నియమిస్తున్నందుకు ఆనందంగా ఉంది.’ అని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.

news18-telugu
Updated: July 12, 2019, 10:09 PM IST
వరల్డ్ బ్యాంక్ సీఎఫ్‌ఓగా భారతీయ మహిళ
అన్షుల్ కాంత్ (Image:Twitter)
news18-telugu
Updated: July 12, 2019, 10:09 PM IST
వరల్డ్ బ్యాంక్ సీఎఫ్ఓగా భారతీయ మహిళ ఎంపికయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ గా ఉన్న అన్షుల్ కాంత్‌ను వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఎంపికైనట్టు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ ప్రకటించారు. వరల్డ్ బ్యాంక్‌లో ఆర్థిక వ్యవహారాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తారు. నేరుగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడికి రిపోర్ట్ చేస్తారు. ‘అన్షులా కాంత్‌ను వరల్డ్ బ్యాంక్ ఎండీ - సీఎఫ్‌ఓగా నియమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ఆమెకు 35 ఏళ్ల అనుభవం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆమె సృజనాత్మక, సాంకేతిక పనితీరుతో ఆకట్టుకున్నారు.’ అని డేవిడ్ ప్రకటించారు. ఆమెను వరల్డ్ బ్యాంక్‌లోకి ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 38 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేర్చారు. అలాగే, 500 బిలియన్ డాలర్ల ఆస్తులను సమకూర్చగలిగారు. ఆమె దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఎస్‌బీఐ పురోగతికి దోహదం చేశాయి. అన్షుల్ కాంత్ 2018 సెప్టెంబర్ నుంచి ఎస్ఐబీ ఎండీగానే కాకుండా బోర్డు మెంబర్‌గా ఉన్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...