ఉత్తరప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ 2023 ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. గ్లోబల్ ట్రేడ్ షో, ఇన్వెస్ట్ UP 2.0 ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంతో.. సాహసోపేతమైన కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటోందన్నారు. యుపిలో రాబోయే నాలుగేళ్లలో 75,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి పట్టణం మరియు గ్రామానికి 10 నెలల్లో లేదా డిసెంబర్ 2023 నాటికి 5G రోల్ అవుట్ ను (పూర్తిగా) అందజేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిలయన్స్ రిటైల్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. యూపీలో తాము.. రెండు కొత్త కార్యక్రమాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకురావాలని అనుకుంటున్నామన్నారు. అవి Jio School అండ్ Jio AI(అర్టిఫిషియల్ ఎంటెల్లిజెంట్) డాక్టర్ అన్నారు. ఈ సందర్భంగా .. యూపీలో 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తామని ముఖేశ్ అంబానీ తెలిపారు.
ఇండియా బలమైన వృద్ధి మార్గంలో పయనిస్తోందని అన్నారు. PM మోడీ యొక్క దార్శనికత మరియు నిర్మలా సీతారామన్ యొక్క బడ్జెట్ 2023ని ప్రశంసించారు. పట్టణ భారతదేశం మరియు గ్రామీణ భారతదేశం మధ్య అంతరం కూడా తగ్గుతోందని తెలిపారు. ఇండియా యువతర దేశం అని.. శ్రద్ధ పెట్టి పనులు చేస్తే.. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించొచ్చని అన్నారు. దీంతో పాటే.. ప్రాంతీయ అసమతుల్యతలు త్వరగా మాయమవుతాయన్నారు. దీనికి యూపీ మంచి ఉదాహరణగా తెలిపారు. ఇలా.. లక్నోలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఉత్తరప్రదేశ్‌కు రిలయన్స్ ఏం చేయబోతోందో వాటి జాబితాను వివరించారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు యూపీ దేశంలోనే శాంతిభద్రతలకు ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఈ సమ్మిట్‌కు అందరికీ స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ అన్నారు. నా బాధ్యతను నెరవేర్చేందుకు ఈ సదస్సులో భాగమయ్యానన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచంలోని ప్రతి విశ్వసనీయ స్వరం విశ్వసిస్తోంది. భారతీయుల ఆత్మవిశ్వాసం పెరగడమే దీనికి ప్రధాన కారణమన్నారు.
అతి త్వరలో దేశంలో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రంగా యూపీ గుర్తింపు పొందనుందన్నారు. నేడు యూపీ ఆశాకిరణంగా మారిందని.. ఒకప్పుడు యూపీని బీమారు రాష్ట్రం అని పిలిచేవారని .. అప్పడు అందరూ యూపీపై ఆశలు వదులుకున్నారని గుర్తు చేశారు. అయితే గత 5-6 ఏళ్లలో యూపీ తన కొత్త గుర్తింపును ఏర్పరుచుకుందని.. సుపరిపాలనకు అడ్డాగా యూపీ గుర్తింపు తెచ్చుకుంటోందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Pm modi, Reliance