MAKE YOUR CAR ELECTRIC LIKE THIS YOU WILL SAVE THOUSANDS OF RUPEES EVERY MONTH KNOW HOW MUCH IT WILL COST MK
Petrol Car to Electric Car: పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోండిలా..లక్షల్లో డబ్బు ఆదా చేసుకోండి
Electric Car
Petrol Car to Electric Car: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో చాలా మంది పెట్రోల్-డీజిల్‌కు బదులు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికే కారు ఉన్నవారు తమ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు.
Petrol Car to Electric Car: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో చాలా మంది పెట్రోల్-డీజిల్‌కు బదులు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికే కారు ఉన్నవారు తమ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ కిట్ ధర చాలా ఎక్కువగా ఉంది. నిజానికి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలంటే కనీసం 15 లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కానీ భవిలష్యత్తులో ఇంధనం రూపంలో లక్షల రూపాయలను సులభంగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి అయ్యే ఖర్చు , నిర్వహణ చాలా తక్కువ అని సైతం నిపుణులు చెబుతున్నారు. నిజానికి రూ. 4 నుండి 5 లక్షల ఖర్చుతో మీ పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చగల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 12 kWh లిథియం-అయాన్ బ్యాటరీ , 20 kW ఎలక్ట్రిక్ మోటార్ ధర రూ. 4 లక్షల వరకు ఉంటుంది. అంటే మీ పాత పెట్రోల్ కారుకు మరో 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టుకుంటే మీ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకునే అవకాశం ఉంది.
ఇంధన కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడంలో పాలుపంచుకున్న చాలా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వీటిలో ఎట్రియో , నార్త్వేమ్స్ ప్రముఖమైనవి. ఈ రెండు కంపెనీలు పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మారుస్తున్నాయి. WagonR, Alto, Dzire, i10 లేదా ఏదైనా ఇతర పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్‌గా మార్చవచ్చు.
ఎలక్ట్రిక్ కారుతో లక్షలు ఆదా...ఎలాగంటే..
ఉదాహరణకు పెట్రోల్ , డీజిల్ కార్లు సాధారణంగా 16 నుండి 22 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంటాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ. 100, మైలేజీ 16 kmpl తీసుకుంటే పెట్రోల్ కారు ధర కిలోమీటరుకు 6.25 పైసలు అవుతుంది. డీజిల్ ₹95 లీటర్ 22 kmpl మైలేజీతో, కిలోమీటరుకు రూ.4.31 ఖర్చవుతుంది.
TATA Nexon ఎలక్ట్రిక్ వెర్షన్ కారు విషయానికి వస్తే యూనిట్ ధర రూ.6గా పరిగణిస్తే, దానిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి రూ.181.2 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దాదాపు 300 కి.మీ మేర పరుగులు తీస్తుంది. ఈ విధంగా, దాని ధర కిలోమీటరుకు దాదాపు 60 పైసలు మాత్రమే.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.