వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫర్ హోమ్ ఒత్తిడిని తగ్గించే ఉపకరణాలు

మీ కొనుగోళ్లను సులభతరం చేసుకోవడానికి ఉత్తేజకరమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఇఎంఐ లతో నిండి ఉన్న HDFC బ్యాంక్ సమ్మర్ ట్రీట్ HDFC Bank Summer Treats స్కీమ్ ను పరిశీలించండి.

news18-telugu
Updated: June 28, 2020, 3:11 PM IST
వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫర్ హోమ్ ఒత్తిడిని తగ్గించే ఉపకరణాలు
ల్యాప్ టాప్ (ప్రతీకాత్మక చిత్రం )
  • Share this:
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా - ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న తరుణంలో ఇంటి నుండే పని చేయడం ఒక కొత్త ప్రామాణికంగా మారింది. ఆఫీసు పని, ఇంటి పనులు మరియు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం రోజువారీ సవాలుగా మారింది, వాస్తవానికి ఇప్పుడు ఎటువంటి తంత్రాలు లేకుండా వేగంగా వంటపని పూర్తి చేయాలి. గిన్నెలు కడగడం నుండి, నేల తుడవడం వరకు ప్రతీ పని ఇప్పుడు మీ భుజాలపై పడింది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ పనులన్నీ మీ పని సమయాన్ని తినేస్తున్నాయి. కాబట్టి మీరు దీనిని ఎలా సులభతరం చేయవచ్చు? అయితే కొన్ని గృహోపకరణాలు మీ రోజువారీ పనుల భారాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్

రోబో వాక్యూమ్ క్లీనర్ (ప్రతీకాత్మక చిత్రం)


మీ ఇంటిలోని దుమ్ము శుభ్రపరచడానికి యంత్రాలను జరుపుకుంటూ, ముందుకీ, వెనుకకు లాగవలసిన హ్యాండిల్డ్ వాక్యూమ్‌ల గురించి ఇకపై మరిచిపోండి. నేటి రోబో వాక్యూమ్ క్లీనర్లు కార్పెట్, వుడెన్ ఫ్లోరింగ్‌ను సులువుగా శుభ్రం చేయగలవు. వీటిలో నావిగేషన్ సెన్సార్, వాటర్ ట్యాంక్, ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ మరియు డర్ట్ డిటెక్షన్ టెక్నాలజీ వంటి స్మార్ట్ ఫీచర్లు కలవు. కొన్ని రోబోట్ వాక్యూమ్‌లను మొబైల్ యాప్ మరియు వాయిస్ కమాండ్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఈ చిన్ని రోబోట్లు మీ ఇంటిని శుభ్రం చేసే పనిని చాలా సులభతరం చేస్తాయి. వాటి పని సామర్థ్యం దృష్ట్యా, వాటి ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ HDFC బ్యాంక్ సమ్మర్ ట్రీట్ లతో మీరు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు లేదా క్రోమాలో మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో ఈజీ ఇఎంఐ రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు.

డిష్ వాషర్లు

 

డిష్ వాషర్ (ప్రతీకాత్మక చిత్రం)
రుచికరమైన భోజనం వండటం చాలా సరదాగా ఉంటుంది, కానీ ఆ తరువాత సింక్ నిండా పేరుకున్న జిడ్డు పాత్రలు చాలా తలనొప్పిగా మారతాయి. మీరు ఒక పెద్ద కుటుంబంలో నివసిస్తున్నట్లయితే రోజుకి మూడుసార్లు పాత్రలు శుభ్రపరచడం అనేది బాధాకరమైన విషయమే కాకుండా దానికి ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. అటువంటి సమయంలో డిష్ వాషర్లు సమయాన్ని ఆదా చేస్తాయి. నేటి డిష్ వాషర్లు నీటిని మరియు విద్యుత్తుని కూడా ఆదా చేస్తాయి, మరి కొన్నింటిని స్మార్ట్ పరికరాలతో సమకాలీకరించవచ్చు. ఈ విధంగా మీకు సమయం అలాగే నీరు మరియు విద్యుత్తు వంటి వనరులను ఆదా అవుతాయి.

 HD స్మార్ట్ టీవీలు & హోమ్ థియటర్ సిస్టమ్స్

స్మార్ట్ టీవీ, హోమ్ థియేటర్


మన జాగ్రత్త కోసం మరియు మన బాధ్యతగా అందరం ఇంట్లో ఉంటున్నాం, కానీ దురదృష్టవశాత్తూ వినోదం అనేది పరిమితం అయిపోయింది. ఇటివంటి సమయంలో ఒక శుభవార్త, అదేమిటంటే మీరు స్మార్ట్ HD టీవీతో ఇంటిలోనే మరింత వినోదాన్ని పొందవచ్చు. OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రతీ వినియోగదారుడికి ఇష్టమైన చలన చిత్రాలు, టీవీ కార్యక్రమాలు మరియు డాక్యుమెంటరీలు అందుబాటులో ఉన్నాయి, వీటన్నింటినీ హోమ్ థియేటర్ ద్వారా సినిమా హాల్ లో చూసిన అనుభూతిని పొందుతారు.
కాబట్టి HDFC బ్యాంక్ సమ్మర్ ట్రీట్ ఆఫర్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందించే ఏదైనా దుకాణానికి వెళ్లి మీరు సినిమాలు చూసే అనుభూతిని అప్‌గ్రేడ్ చేయండి. HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు లేదా PayZapp ద్వారా మీరు ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు, తద్వారా రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు.

 

5-ఇన్ -1 స్మార్ట్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్లు

5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్లు


మీరు వారాంతరాలలో ఆహారాన్ని వండుతున్నారా, లేదా మాటిమాటికి కిరాణా దుకాణానికి వెళ్లకుండా వారానికి సరిపడా వస్తువులను నిల్వ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ అవసరాలన్నిటినీ తీర్చడానికి మీకు విశాలమైన రిఫ్రిజిరేటర్ అవసరం. సరికొత్త 5-ఇన్-1 స్మార్ట్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్లు అందుకు సరిగ్గా సరిపోతాయి! వాటి పరిమాణంతో పాటు, వేగవంతమైన ఫ్రీజింగ్ మరియు కూరగాయలు తాజా ఉంచడానికి వివిధ రకాల కూలింగ్ మోడ్స్ లలో సెట్ చేసుకునే అవకాశం కూడా కలదు.
ఈ ఉపకరణాలు మీకు ఆర్ధిక భారం అవుతాయని మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. HDFC బ్యాంక్ సమ్మర్ ట్రీట్స్ ద్వారా Samsung మరియు LG ఎలక్ట్రికల్స్ దుకాణాలలో క్యాష్ బ్యాక్ పొందవచ్చు మరియు నో కాస్ట్ ఇఎంఐ పద్దతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.

కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతి వలన మీరు ప్రతీ రోజు అటు ఆఫీసు పని మతియు ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక మార్గం వెతకాలి. అందుకు సరైన గాడ్జెట్లు మీరు తెలివిగా పనిచేయడానికి, పలురకాల పనులు మెరుగ్గా చేయడానికి, మరింత ప్రొఫెషనల్ గా చూపడంలో ఇవి మీకు సహాయపడతాయి.

బ్లూటూత్ హెడ్‌సెట్‌లు

బ్లూటూత్ హెడ్ సెట్


అనవసరపు శబ్దాలను నిరోధించే ఒక మంచి బ్లూటూత్ హెడ్‌సెట్‌ తో మీరు ఫోను మాట్లాడవచ్చు, టీ పెట్టడం వంటి చిన్న చిన్న ఇంటి పనులు చేస్తూ ఎటువంటి శబ్దం లేకుండా కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొనడం వంటివి చేయవచ్చు.

ల్యాప్‌టాప్:

ల్యాప్ టాప్ (ప్రతీకాత్మక చిత్రం )


మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్న మీ పాత ల్యాప్‌టాప్‌తో మీరు విసిగిపోతే, ఎటువంటి అంతరాయం లేకుండా, పలు రకాల పనులను ఒకేసారి వేగంగా చేయడానికి తగిన ఉత్సాహాన్ని అందించే వేగవంతమైన ఒక కొత్త ల్యాప్‌టాప్ అవసరం. హై రిజల్యూషన్ మరియు వేగవంతమైన ప్రాసెసర్ మీరు పనిచేయడానికి లేదా గేమ్ కోసం ఉపయోగించినప్పటికీ కూడా ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది! మంచి బ్యాటరీ లైఫ్ గల ఒక కంప్యూటర్, విద్యుత్ కోతల సమయంలో కూడా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేయడానికి మీకు ఎంతో సహాయపడుతుంది.

రోబోటిక్ వాక్యూమ్ క్లీన్


ప్రపంచమంతా కరోనా వైరస్ సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఇంట్లోనే ఉంటూ మీ ఒత్తిడిని తగ్గించుకుంటూ, మీ ఆరోగ్యం గురించి మీరు చేయవలసిన ప్రయత్నమంతా చేయండి. పనివారు చేసే పనులను ఎంతో సమర్థవంతమైన గృహోపకరణాలకు అప్పగించి, మీ భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వండి. మీ కొనుగోళ్లను సులభతరం చేసుకోవడానికి ఉత్తేజకరమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఇఎంఐ లతో నిండి ఉన్న HDFC బ్యాంక్ సమ్మర్ ట్రీట్ HDFC Bank Summer Treats స్కీమ్ ను పరిశీలించండి; ఈ కొత్త పరిస్థితిలో ఇమడడానికి మీకు కావలసిన వాటన్నింటిని పొందవచ్చు, అలాగే సురక్షితంగా కూడా ఉండవచ్చు.

This is a partnered post.
First published: June 28, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading