news18-telugu
Updated: January 14, 2019, 7:09 PM IST
Makara SANKRANTI 2019: పిడకలు, గొబ్బెమ్మలు కావాలా? ఆన్లైన్లో కొనుక్కోండి
పిడకలు, గొబ్బెమ్మలు... సంక్రాంతి సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువ. గ్రామాల్లోకి వెళ్లే ఎక్కడ పడితే అక్కడ పేడ కనిపిస్తుంది. పేడ తీసుకొచ్చి పిడకలు, గొబ్బెమ్మలు తయారుచేస్తుంటారు. కానీ... ఇప్పుడు అంతా హైఫై. ఫాస్ట్ కల్చర్‌లో పండుగల స్వరూపం కూడా మారిపోతోంది. పిడకలు, గొబ్బెమ్మలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయంటే నమ్మరు కదా? అయితే ఒకసారి అమెజాన్‌లోకి వెళ్లి pidakalu, gobbemmalu అని టైప్ చేసి చూడండి. రెడీమేడ్‌గా పిడకలు కనిపిస్తాయి. వాటిని ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికి వచ్చేస్తాయి.
ఇది కూడా చదవండి:
Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా
పిడకలు, గొబ్బెమ్మలు మాత్రమే కాదు... మీకు కావాలంటే ఆవు పేడ కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. పల్లెల్లో అంటే పేడ దొరుకుతుంది కాబట్టి పిడకలు, గొబ్బెమ్మలు చేసుకోవచ్చు కానీ... పట్టణాలు, నగరాల్లో పేడ దొరకదు కదా? అందుకే ఆ లోటు తీరుస్తున్నాయి పలు సంస్థలు. పేడ, పిడకలు, గొబ్బెమ్మలు ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాయి. చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేసి వీటిని తెప్పించుకుంటున్నారు. పండుగ చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి:
కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి
10 పిడకలకు రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. 5, 10, 15, 20 ఇలా వేర్వేరు ప్యాకింగ్‌లో ఉంటాయి. మీకు కావాల్సినన్ని కొనొచ్చు. 5 గొబ్బెమ్మలకు రూ.125. మీరు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. మామూలుగా పూజసామాగ్రితో పాటు అంత్యక్రియల సామాగ్రిని ఆన్లైన్లో అమ్మడం చూసి షాకయ్యాం కానీ... ఇప్పుడు ఏకంగా పేడ, పిడకలు, గొబ్బెమ్మలు ఆన్లైన్ సేల్‌లో ఉండటం చూసి ఇంకా షాకవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు
REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి
SBI CARD: ఎస్బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త
First published:
January 14, 2019, 5:52 PM IST