MAJOR AUTOMAKERS REPORT SUBDUED SALES IN FEB DUE TO CHIP SHORTAGE HIGH ACQUISITION COST GH VB
Auto Mobile: ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న వాటి కొరత.. స్వల్పంగా తగ్గిన విక్రయాలు.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
కార్ల తయారీలో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్‌ల కొరత ఆటోమొబైల్ పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. దీని కారణంగా ఫిబ్రవరి నెలలో వాహన అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.
కార్ల తయారీలో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్‌ల(Chips) కొరత ఆటోమొబైల్(Auto Mobile) పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. దీని కారణంగా ఫిబ్రవరి నెలలో వాహన అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి గతేడాది ఫిబ్రవరి నెలలో 1,64,469 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది ఇదే కాలంలో 1,64,056 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే, కరోనా తగ్గుముఖం పట్టి.. వాహన విక్రయాలు ఊపందుకున్నప్పటికీ చిప్‌ల కొరత కారణంగా విక్రయాలు పడిపోయాయి. కాగా, చిప్స్(Chips0 కొరతపై మారుతీ సుజుకి(Maruti Suzuki) స్పందిస్తూ ‘‘వాహన తయారీలో కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరత ప్రధానంగా దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలపై స్వల్ప ప్రభావం చూపింది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ అన్ని చర్యలను తీసుకుంటుంది. త్వరలోనే మా వాహనాల ఉత్పత్తిని పెంచుతాం." అని పేర్కొంది.
కాగా, చిప్స్ కొరత వాహనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా, వెయిటింగ్ పీరియడ్ పెరగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. మరో, వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే తరహా సమస్యను ఎదుర్కొంది. ఈ సంస్థ ఫిబ్రవరిలో తక్కువ అమ్మకాలను నివేదించింది. ఫిబ్రవరి 2021లో మొత్తం 61,800 యూనిట్లు అమ్ముడవ్వగా.. గత నెలలో 53,159 యూనిట్లకు పడిపోయాయి. మరోవైపు, కంపెనీ దేశీయ విక్రయాలు గతేడాది ఇదే కాలంలో 51,600 యూనిట్లు నమోదవ్వగా.. ప్రస్తుతం ఇది 44,050 యూనిట్లకు తగ్గాయి. "ఆటోమొబైల్ పరిశ్రమ సెమీకండక్టర్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. మా కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హ్యుందాయ్ కార్లను త్వరగా డెలివరీ చేయడానికి అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం." అని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది.
టాటా మోటార్స్, మహీంద్రా కార్ల అమ్మకాల్లో వృద్ది..
కాగా, టాటా మోటార్స్‌పై మాత్రం చిప్ కొతర ప్రభావం పడలేదు. ఫిబ్రవరిలో తన మొత్తం దేశీయ విక్రయాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 58,366 యూనిట్లు విక్రయించగా.. గత నెలలో 73,875 వాహనాలను విక్రయించింది. కంపెనీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఫిబ్రవరి 2021లో 27,225 యూనిట్ల వద్ద ఉండగా.. ఈ ఏడాది 47 శాతం పెరిగి 39,981 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విషయానికొస్తే, దేశీయ విక్రయాలు ఫిబ్రవరి 2021లో 33,859 యూనిట్ల నుండి 11 శాతం పెరిగి 37,552 యూనిట్లకు చేరుకున్నాయి.
మరో ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో మొత్తం అమ్మకాలు పెరిగాయని నివేదించింది. కంపెనీ తన వాహన విక్రయాల్లో 89 శాతం వృద్ధి కనబర్చింది. గత నెలలో 54,455 వాహనాలను విక్రయించింది. మహీంద్రాకు చెందిన అన్ని ఎస్యూవీ విభాగాల అమ్మకాలు 79 శాతం బలమైన వృద్ధిని కనబరిచాయి. ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది." అని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా సప్లై చెయిన్‌కు అంతరాయం..
ఇక, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ఫ్ ఫిబ్రవరి 2022లో మొత్తం 358,254 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించగా.. గతేడాది ఇదే నెలలో 505,467 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. “సెమీకండక్టర్ సమస్యలు తగ్గుముఖం పట్టడం వల్ల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు కొంత మేర ఊపందుకున్నాయి. అయితే, గ్లోబల్ మార్కెట్లో సప్లై చెయిన్‌కు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా వాహన తయారీలో అవసరమయ్యే ముడి సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది." అని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేమల్ థక్కర్ అన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.