Multibaggers | స్టాక్ మార్కెట్ ద్వారా మిలియనీర్ అయిపోవచ్చు. అయితే ఇన్వెస్టర్లకు ఇందుకు ఓపిక అనేది చాలా అవసరం. ఈక్విటీ మార్కెట్‌లో చాలా షేర్లు ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. మిలియనీర్లుగా మార్చేశాయి. దీర్ఘకాలంలో చాలా స్టాక్స్ (Stocks) ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచి పెట్టాయి. అంతేకాకుండా చాలా మంది నిపుణులు కూడా స్టార్ మార్కెట్లో (Stock Market) దీర్ఘకాలం లక్ష్యంగా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని సిఫార్సు చేస్తూ ఉంటారు. అప్పుడు అదిరే రాబడి పొందొచ్చు.
దీర్ఘకాలంలో భారీ లాభాలు అందించిన స్టాక్స్‌లో మనం ఇపపుడు మైథాన్ అలాయ్స్ షేరు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ షేరు రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ను ఏకంగా రూ. కోటికి పైగా మార్చేసింది. ఎలా అని అనుకుంటున్నారా? బోనస్ షేర్లు ద్వారా కూడా ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే ప్రాఫిట్ పాందారు. ఈ షేరు రూ. లక్షను రూ.కోటిగా ఎలా మార్చిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
గుడ్ న్యూస్.. రూ.770 పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.1,800 పతనం!
బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈ ఎక్స్చేంజీల్లో ప్రస్తుతం మైథాన్ అలాయ్స్ షేరు అందుబాటులో ఉంది. అయితే గతంలో చూస్తే ఈ స్టాక్ కేవలం బీఎస్ఈలో మత్రమే అందుబాటులో ఉండేది. 2008-09 మందగమనం తర్వాత ఈ కెమికల్ స్టాక్ రూ. 17.5కు దిగివచ్చింది. 2009లో ఈ ధర వద్ద షేరు ఉంది. అయితే ఇప్పుడు చూస్తే.. ఈ షేరు ధర ఏకంగా రూ. 918 వద్ద కొనసాగుతోంది.
ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. రూ.5 వేల కన్నా ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు!
అంతేకాకుండా ఈ షేరు 2010, 2015లో బోనస్ షేర్లు కూడా అందించింది. ఈ షేరు 2010 జూన్ 17న రెండు షేర్లు ఒక షేరును బోనస్ షేరుగా అందించింది. అంతేకాకుండా 2015 జూలై 15న కూడా కంపెనీ బోనస్ షేరు ఇచ్చింది. ఒక షేరుకు ఒక షేరును ఉచితంగా అందించింది. ఇప్పుడు 2009లో షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి.. 5714 షేర్లు లభించేవి. ఈ 5714 షేర్లు 2010లో బోనస్ షేర్ల తర్వాత చూస్తే.. 8571కు చేరతాయి. అలాగే 2015లో బోనస్ షేర్ల తర్వాత ఇవి 17,142కు చేరతాయి.
ప్రస్తుతం మైథాన్ అలాయ్స్ షేరు ధర ర. 918 వద్ద ఉంది. అంటే ఒక వ్యక్తి 14 ఏళ్ల కిందట రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ.1.57 కోట్లుగా మారి ఉండేది. అంతేకాకుండా కంపెనీ మధ్యంతర డివిడెంట్, తుది డివిడెంట్ వంటివి కూడా అందించింది. వీటిని కూడా కలుపుకుంటే.. అప్పుడు ఇన్వెస్టర్ల రాబడి మరింత పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks