Home /News /business /

MAHINDRA XUV700 PRICE VARIANTS LEAKED AGAIN AHEAD OF OFFICIAL LAUNCH DETAILS HERE SU GH

Mahindra XUV700: విడుదలకు ముందే లీకైన మహీంద్రా XUV700 వేరియంట్ల ధరలు​.. ఏ వేరియంట్​కు ఎంత ధరంటే?

Mahindra XUV700

Mahindra XUV700

దేశీయ అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే కొత్త XUV700 కారును విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ ఫ్యూచరిస్టిక్​ ఎస్​యూవీ వాహన అమ్మకాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.

దేశీయ అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే కొత్త XUV700 కారును విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ ఫ్యూచరిస్టిక్​ ఎస్​యూవీ వాహన అమ్మకాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. మహీంద్రా XUV700 (Mahindra XUV700) మొత్తం 34 వేరియంట్లలో విడుదల కానుంది. ఈ వేరియంట్లను వాటి ఇంజిన్​, సీటింగ్​, ట్రిమ్​ ఆప్షన్స్​ ఆధారంగా విభజించింది. ప్రధానంగా మహీంద్రా XUV700 వాహనం MX, AX3, AX5, AX7 అనే నాలుగు ట్రిమ్​ వేరియంట్లలో లభిస్తుంది. ఇది పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ 36 వేరియంట్లను విడుదల చేసేందుకు మహీంద్రా సంస్థ సిద్దమవుతుండగా.. విడుదలకు ముందే వీటి ధరలు ఆన్​లైన్​లో లీకవ్వడం గమనార్హం.

7 సీటర్, 5 సీటర్ వేరియంట్లకు సంబంధించిన ప్రతి వేరియంట్ ధర ఎంత ఉంటుందనేది తాజా లీకేజీని బట్టి తెలుసుకోవచ్చు. ఇది అధికారికంగా వెల్లడైన ధరల జాబితా కానప్పటికీ దాదాపు ఇదే ధరల శ్రేణిలో వేరియంట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. కార్, బైక్ నివేదిక పేర్కొన్న మహీంద్రా XUV700 ధరలను పరిశీలిద్దాం.

* 5 -సీటర్ వేరియంట్ల ధరలు..
MX MT పెట్రోల్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్​షోరూమ్​)
MX MT డీజిల్ వేరియంట్ ధర రూ. 12.49 లక్షలు

AX3 MT పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు
AX3 MT డీజిల్​ వేరియంట్ ధర రూ. 14.99 లక్షలు

AX5 MT పెట్రోల్ FWD వేరియంట్ ధర రూ. 14.99 లక్షలు
AX5 AT పెట్రోల్ FWD వేరియంట్ ధర రూ. 16.29 లక్షలు

AX5 MT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 15.99 లక్షలు
AX5 AT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 17.29 లక్షలు
AX5 AT డీజిల్ AWD వేరియంట్ ధర రూ. 18.79 లక్షలు

AX5 (O) AT పెట్రోల్ FWD వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు
AX5 (O) AT పెట్రోల్ AWD వేరియంట్ ధర రూ. 18.49 లక్షలు
AX5 (O) AT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు
AX5 (O) AT డీజిల్ AWD వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు

* 7 సీటర్​ వేరియంట్ల ధరలు..
MX MT డీజిల్ వేరియంట్ ధర రూ. 13.19 లక్షలు (ఎక్స్​ఫోరూమ్)
MX MT పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.69 లక్షలు

AX5 MT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 16.69 లక్షలు
AX5 AT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు

AX5 MT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 15.69 లక్షలు
AX5 AT పెట్రోల్ FWD వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు

AX5 AT పెట్రోల్ AWD వేరియంట్ ధర రూ. 18.49 లక్షలు

AX5 (O) AT డీజిల్ FWD వేరియంట్ ధర రూ. 18.69 లక్షలు
AX5 (O) AT పెట్రోల్ FWD వేరియంట్ ధర రూ. 17.69 లక్షలు

AX7 AT డీజిల్ Std FWD వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు
AX7 AT డీజిల్ Opt FWD వేరియంట్ ధర రూ. 20.19 లక్షలు

AX7 AT పెట్రోల్ Opt AWD వేరియంట్ ధర రూ. 21.69 లక్షలు
AX7 AT పెట్రోల్ Std FWD వేరియంట్ ధర రూ. 18.49 లక్షలు

AX7 AT పెట్రోల్ Opt FWD వేరియంట్ ధర రూ. 19.19 లక్షలు
AX7 AT పెట్రోల్ Std AWD వేరియంట్ ధర రూ. 19.99 లక్షలు
Published by:Sumanth Kanukula
First published:

Tags: Automobiles, Mahindra and mahindra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు