Mahindra XUV700: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్​ మహీంద్రా..వారికి బహుమతిగా ఎక్స్​యూవీ 700 జావెలిన్ ఎడిషన్

ఆనంద్ మహింద్రా(ఫైల్ ఫొటో)

మహీంద్రా సంస్థల అధినేత మహీంద్రా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాజా ఒలింపిక్స్, పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతలకు సరికొత్త XUV700 జావెలిన్ ఎడిషన్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

  • Share this:
టోక్యోలో జరిగిన ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్​లో ఈసారి భారత ఆటగాళ్లు మెరిశారు. ఎన్నడూ లేనంతగా ఎక్కువ పతకాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. జావెలిన్​ త్రో క్రీడాకారుడు నీరజ్​ చోప్రా భారత్​కు స్వర్ణం సాధించి పెట్టారు. అంతేకాదు పారా ఒలింపిక్స్​లో ఈ సారి భారత్​కు రెండు సర్ణ పతకాలు దక్కాయి. జావెలిన్​ త్రో విభాగంలో సుమిత్​ అంటిల్, మహిళల ఘూటింగ్ విభాగంలో అవని లెఖారా భారత్​కు స్వర్ణ పతకం సాధించి పెట్టారు. దీంతో భారత క్రీడా చరిత్రలో టోక్యో ఒలిపింక్స్, పారా ఒలింపిక్స్​ చెరగని ముద్ర వేశాయి. ఈ పోటీల్లో పతకాలు సాధించిన వారికి ఊహించని గిఫ్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

ఒలింపిక్స్​, పారా ఒలింపిక్స్​లో గెలిచిన ఆటగాళ్లను యావత్​ భారతదేశం ఎంతగానో కొనియాడుతోంది. అంతేకాదు, వీరిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేట్​ వ్యక్తులు, ప్రముఖ సంస్థలు బహుమతులు అందిస్తున్నాయి. తాజాగా మహీంద్రా సంస్థల అధినేత మహీంద్రా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తాజా ఒలింపిక్స్, పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేతలకు సరికొత్త XUV700 జావెలిన్ ఎడిషన్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు గోల్డ్ మెడల్ విజేతల అవసరాలకు తగ్గట్లుగా కారును డిజైన్​ చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ పనిని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్స్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్​కు అప్పగించారు.

విజేత అభిరుచులకు తగ్గట్లు డిజైన్​..
మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ ఇప్పటికే 'జావెలిన్' అనే పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. అయితే ఇప్పటి వరకు, XUV700 జావెలిన్ స్పెసిఫికేషన్లకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఈ స్పెషల్​ ఎడిషన్ XUV700 సాధారణ XUV700కి ఎలా భిన్నంగా ఉంటుందనే దానిపై కూడా స్పష్టత లేదు. ఈ కార్లను ఆకర్షణీయంగా డిజైన్​ చేసే అవకాశం ఉంది. ఒలింపిక్స్​లో బంగారు పతకాలు గెలుపొందిన పారా ఒలింపియన్ల అవసరాలకు అనుగుణంగా దీని ఇంటీరియర్ డిజైన్​​ను మార్చనున్నారు.

ఆనంద్ మహీంద్రా క్రీడాకారులను ఆదుకోవడంలో చాలా ముందుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో, భారత్​ ఆస్ట్రేలియా సిరీస్​ను కైవసం చేసుకోవడంతో మహీంద్రా థార్ ఎస్‌యూవీని క్రీడాకారులకు బహుమతిగా ప్రకటించారు. క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నటరాజన్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌కు థార్​ ఎస్​యూవీని బహుమతిగా ఇచ్చారు.
Published by:Krishna Adithya
First published: