మహీంద్రా కంపెనీ(Mahindra Company) నుంచి వచ్చిన ఎస్యూవీ.. మహీంద్రా ఎక్స్యువీ 700 (Mahindra XUV 700) సేల్స్ పరంగా దూసుకుపోతోంది. ఇండియన్ మర్కెట్లో బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీగా (mid-size SUV) ఈ వెహికల్ నిలిచింది. ఈ మోడల్‌ను కంపెనీ గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లాంచ్ చేసింది. అప్పటి నుంచి అమ్మకాల్లో అదరగొడుతోంది. తాజాగా మహీంద్రా XUV 700.. 14 వేల యూనిట్ల సేల్స్ నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు పేర్కొంది. 2021లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన పెద్ద కార్లలో XUV 700 ఒకటి. మూడు వరుసల సీట్లతో, ఆకట్టుకొనే డిజైల్లో.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో ఇది అందుబాటులోకి వచ్చింది.
ఎన్నో కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ కోసం కస్టమర్లు చాలా కాలంగా ఎదురుచూశారు. మహీంద్ర అండ్ మహీంద్రా 2020లో తీసుకొచ్చిన అప్డేటెడ్ థార్(updated thar), బోలెరో నియో (bolero nio) మోడల్ సైతం అదే స్థాయిలో సంస్థకు లాభాలను తెచ్చి పెట్టింది. ఇటీవల కాలంలో వీటికి మించి
XUV 700 సేల్స్‌లో దూసుకుపోతోంది. ఈ జనవరి 14 లోపు 14 వేల యూనిట్ల అమ్మకాలు నమోదు చేయాలని ఈ వాహనం లాంచింగ్ టైమ్‌లో కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే కొన్ని రోజుల తేడాతో టార్గెట్ చేరుకుంది.
Mahindra XUV 700 MX సిరీస్ 2.0 లీటర్ టర్బో Gd పెట్రోల్ వేరియంట్ అత్యధికంగా 195 బీపీహెచ్ పవర్‌ను, 380 nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. 2.2 లీటర్ కామన్ రైల్ టర్బో డీజిల్ ఇంజిన్ వేరియంట్ 153 బీపీహెచ్ శక్తిని, 360 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెహికల్ AX series 182 బీపీహెచ్ శక్తిని, 420 nm టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఈ కారులో అత్యాధునిక ఫీచర్లను మహీంద్రా అందించింది. వాయిస్ కమాండ్ ద్వారా పని చేసే అడ్రోనేక్స్ కనెక్టెడ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా కారుకు కమాండ్స్ ఇవ్వచ్చు. 12 స్పీకర్లతో సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఆరు రకాలుగా సీట్లను అడ్జస్ట్ చేసుకునే విధానం, పనోరమిక్ సన్ రూఫ్, సైడ్, ఫ్రంట్ఎయిర్ బ్యాగ్స్ , 360 సరౌండెడ్ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, హిల్ హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. డైనమిక్ స్టెబుల్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఉంది. 8 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ పైనే కంట్రోల్ బటన్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలు(ఎక్స్ షోరూం). ప్రస్తుతం MX పెట్రోల్ వేరియంట్, ఐదు సీట్ల కారు రూ.12.95 లక్షలు(ఎక్స్ షోరూం) ధర వద్ద అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.