Mahindra XUV700: మరో అరుదైన ఘనత సాధించిన మహీంద్రా ఎక్స్​యూవీ 700.. అరుదైన రికార్డు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా అండ్​ మహీంద్రా ((Mahindra & Mahindra)) నుంచి ఇటీవల విడుదలైన ఎక్స్​యూవీ 700 ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో తెలిసిందే. ఈ కారు(Car) తాజాగా మరో రికార్డును సాధించింది.

  • Share this:
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్​ మహీంద్రా (Mahindra & Mahindra) నుంచి ఇటీవల విడుదలైన ఎక్స్​యూవీ700 (Mahindra XUV700) ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో తెలిసిందే. ఈ కారు(Car) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి లడాఖ్ (Ladakh) లోని ఉమ్లాంగ్ లో ప్రయాణించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. దేశంలో తయారై ఢిల్లీ(Delhi) నుంచి మనాలి మీదుగా లేహ్​కు రెండో రోజు చేరుకుందని, లేహ్ నుంచి హనాలీకి మూడో రోజు, అక్కడ నుంచి ఉమాంగ్లాకు చేరుకుందని కంపెనీ ప్రకటించింది.లడఖ్ నుంచి ఉమ్లాంగ్ రహదారి సముద్ర మట్టం నుంచి 19300 అడుగుల ఎత్తుకు ప్రయాణించింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ బేస్ క్యాంపు కన్నా ఉమ్లాంగ్ రహదారి 1667 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో వాహనాలు ప్రయాణించే అత్యంత ఎత్తైన రోడ్డు ఇదే కావడం విశేషం.

విజయవంతంగా ప్రయాణం:
ఈ రహదారిలో ప్రయాణం అంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆక్సిజన్ కూడా సరిగా అందదు. అయినా ఇలాంటి సమస్యాత్మక రహదారిలో ఎక్స్ యూ వీ 700 విజయవంతంగా ప్రయాణించింది. ఎన్నో పర్వతాలు, లోయలు దాటుకుంటూ ప్రయాణం సాగించింది. చాలా ప్రాంతాల్లో మట్టి రోడ్లు, ఇసుక మేటలు, బురద, గోతుల దారిలోమహీంద్రా ఎక్స్​యూవీ 700 (Mahindra XUV700) విజయవంతంగా ప్రయాణించినట్టు కంపెనీ తెలిపింది.
Bajaj Pulsar N250, F250: పల్సర్ బైక్ లవర్లకు శుభవార్త.. అదిరే లుక్ తో మార్కెట్లోకి కొత్త మోడల్.. వివరాలివే

ఒకటి కాదు రెండు కార్లు:
ప్రపంచంలోనే ఎత్తైన సమస్యాత్మక రహదారి లేహ్ నుంచి ఉమ్లాంగ్ దారిలో ఒక కారు ప్రయాణించడమే కష్టం. కానీ మహీంద్రా పెట్రోల్ ఆటోమేటిక్ ఎక్స్ యూ వీ 700 మోడల్ కార్లు రెండు ఒకేసారి ఈ రికార్డు నెలకొల్పాయని కంపెనీ అధికారులు తెలిపారు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. భారతదేశంలో తయారైన కార్లు ఈ దారిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇలాంటి ఫీట్ ద్వారా భారత వాహనరంగ సత్తా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.
Home Loans: పోస్టాఫీస్ కస్టమర్లకు HDFC Bank శుభవార్త.. అందుబాటులోకి Home Loans.. వివరాలివే

ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేలా డిజైన్​
లేహ్ నుంచి ఉమ్లాంగ్ మార్గంలో ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ దారులు అనేక సార్లు తమ కొత్త మోడళ్ల కార్లను ఈ మార్గంలో నడిపారు. ఇటీవలి కాలంలో లాంబార్డో కారు కూడా ఈ మార్గంలో ప్రయాణించింది. అయితే దేశంలో తయారైన కార్లలో మొదటి సారిగా మహీంద్రా కంపెనీ కారు ప్రయాణమే మొదటిది. వాహనాలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటాయని కంపెనీ వినియోగదార్లకు ఆకర్షించేందుకు ఇలాంటి సమస్యాత్మక రహదారుల్లో ప్రయాణించి నిరూపించుకుంటూ ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published: