హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra XUV 400: మహీంద్రా నుంచి ఆల్-ఎలక్ట్రిక్ XUV 400.. దీని ప్రత్యేకతలు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే..

Mahindra XUV 400: మహీంద్రా నుంచి ఆల్-ఎలక్ట్రిక్ XUV 400.. దీని ప్రత్యేకతలు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే..

Mahindra XUV 400 (PC : Mahindra)

Mahindra XUV 400 (PC : Mahindra)

Mahindra XUV 400: ఇండియన్ మార్కెట్‌లో ఎక్స్‌యూవీ 400 (XUV400) ఆల్-ఎలక్ట్రిక్ SUVని సెప్టెంబర్ 8న పరిచయం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మహీంద్రా కంపెనీ. ఈ అప్‌కమింగ్ SUV కి సంబంధించి ఒక కొత్త టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త కార్ల (New Cars)ను పరిచయం చేస్తోంది. అయితే ఈ కంపెనీ నుంచి ఫుల్లీ-ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా కంపెనీ వారందరికీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ మార్కెట్‌లో ఎక్స్‌యూవీ 400 (XUV400) ఆల్-ఎలక్ట్రిక్ SUVని సెప్టెంబర్ 8న పరిచయం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌కమింగ్ SUV కి సంబంధించి ఒక కొత్త టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

* ధర ఎంత?

ఆల్-ఎలక్ట్రిక్ XUV 400 ధర రూ. 14 లక్షల నుంచి రూ. 16 లక్షల రేంజ్‌లో ఉంటుందని అంచనా. ఇంకో వారం రోజుల్లో లాంచ్ కానున్న ఈ ఆల్-ఎలక్ట్రిక్ SUV ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా రాణిస్తున్న టాటా నెక్సాన్‌తో పోటీపడనుంది.

* వెహికల్ బ్యాటరీ

ఈ SUV దాదాపు 150 bhp ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని రిపోర్ట్స్ తెలిపాయి. XUV400 బ్యాటరీ పవర్ ఎంత, ఇది సింగిల్ ఛార్జ్‌పై ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనే వివరాలను మహీంద్రా కంపెనీ ఇప్పటివరకైతే వెల్లడించలేదు. ఆటోమొబైల్ వర్గాల ప్రకారం, ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ రెండు బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతూ సింగిల్ ఛార్జ్‌పై 300 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

* స్పెసిఫికేషన్లు

ఈ వాహనంలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫెసిలిటీని అందించినట్లు సమాచారం. మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో XUV400 రిలీజ్ అవుతుంది. EVకి సంబంధించిన ప్రత్యేక డేటా అందించేలా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేశారు.

ఇది కూడా చదవండి : ఫ్లైట్ ఎక్కేవారికి గుడ్ న్యూస్.. దిగొస్తున్న విమానయాన సంస్థలు.. అసలు మ్యాటర్ ఇదే..

* డిజైన్

టీజర్ వీడియోలో XUV400 కారు డిజైన్ కనిపించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో షో చేసిన eXUV300 కాన్సెప్ట్‌తోనే XUV400 వస్తోంది. అయితే దీని బ్యాక్‌సైడ్‌లో సరికొత్త ర్యాప్‌రౌండ్ టెయిల్-ల్యాంప్‌లు అందించారు. ఈ SUV కారు ముందు భాగంలోని X-ప్యాట్రన్డ్‌ గ్రిల్‌ అనేది బ్రాంజ్‌, బ్లాక్ ఫినిష్‌తో వస్తుందని తెలుస్తోంది. ఇక బ్రాంజ్‌ కలర్‌లో ఉన్న మహీంద్రా ‘ట్విన్ పీక్స్ (Twin Peaks)’ లోగో చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. టెయిల్ గేట్ స్టైలింగ్ కూడా XUV300కి పూర్తి భిన్నంగా ఉంది.

తాజా టీజర్ చూస్తుంటే కొన్ని ఫీచర్లు మినహా XUV400 కారు XUV300 SUV కి ఒక ఎలక్ట్రిక్ వెర్షన్ అని తెలుస్తోంది. అలానే XUV300తో పోలిస్తే ఎలక్ట్రిక్ SUV ప్యాసింజర్లకు కాస్త ఎక్కువ స్పేస్, బిగ్గర్ బూట్ ఇవ్వచ్చు. ఈ కారులో స్క్వేర్ షేప్‌లో ఉన్న సన్నని హెడ్‌ల్యాంప్స్‌ ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (DRL)లతో వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Electric cars, Mahindra and mahindra, New cars, SUV

ఉత్తమ కథలు