దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) నుంచి విడుదలయ్యే కార్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లతో ఈ కంపెనీ కార్లను తీసుకొస్తోంది. అయితే తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్ (XUV300 TurboSport) కారును లాంచ్ చేసింది. దీని ధర ఎంత, ఏ ఇంజన్ అందించారు, ఆ ఇంజన్ పవర్ ఏంటి, ఫీచర్లు ఏమేం ఉన్నాయి? వంటి విశేషాలు తెలుసుకుందాం.
కొత్త టర్బో స్పోర్ట్ ధర
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇండియాలో తాజాగా రిలీజ్ చేసిన XUV300 TurboSport ప్రారంభ ధర రూ.10.35 లక్షలుగా ఉంది. ఈ కారు టాప్ వేరియంట్ 12.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఈ XUV మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ ఫ్యూయల్ ట్రిమ్‌లో మాత్రమే లాంచ్ అయింది. కంపెనీ ప్రకారం, ఈ కారు కేవలం 5 సెకన్ల సమయంలో 0-60kmph స్పీడ్ చేరుకోగలదు. W6, W8, W8(O) ట్రిమ్‌లలో ఈ కొత్త టర్బోస్పోర్ట్ సిరీస్ కార్లను కంపెనీ తీసుకొచ్చింది. దీని బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్‌లు, డెలివరీలు అక్టోబర్ 10, 2022 నుంచి ఇండియన్ మార్కెట్లో ప్రారంభమవుతాయి.
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు.. వచ్చేది ఎప్పుడంటే?
ఇంజన్ పవర్
1.2 L TGDi పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే XUV300 టర్బోస్పోర్ట్ 5,000 rpm వద్ద 128 bhp పవర్, 1500-3750 rpm మధ్య 230 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని ఇంజన్ ట్రాన్సియెంట్ టార్క్‌ని 250 Nmకి తీసుకువెళ్లే బూస్ట్ ఫంక్షన్‌తో వస్తుంది. మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో సరికొత్త 1.2L mStallion ఇంజన్‌తో వచ్చిన తొలి SUV ఇది.
కలర్ ఆప్షన్స్
ఈ XUV బ్లాక్ రూఫ్ టాప్‌తో బ్లేజింగ్ బ్రాంజ్, వైట్ రూఫ్ టాప్‌తో నాపోలి బ్లాక్, బ్లాక్ రూఫ్ టాప్‌తో పెర్ల్ వైట్ వంటి డ్యూయల్-టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. బ్లేజింగ్ బ్రాంజ్, పెరల్ వైట్, నాపోలి బ్లాక్ అనే మూడు సింగిల్-టోన్ కలర్ ఆప్షన్స్‌లో కూడా ఇది లభిస్తుంది.
ఒక్క షేరుకు 8 షేర్లు ఉచితంగా పొందొచ్చు.. వారంలోనే భారీ లాభం!
డిజైన్, స్పేస్
ఈ కారులో LED DRLs, సిగ్నేచర్ LED టెయిల్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆల్-బ్లాక్ ORVMs, డ్యూయల్ గ్రిల్, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేశారు. ఈ SUV క్యాబిన్లో తగినంత స్థలం కోసం 2600mm పొడవైన వీల్‌బేస్‌ను అందించారు. 2వ వరుస సీట్లు మొత్తం ముగ్గురు ప్రయాణికులకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌ను అందిస్తాయి. వెనుక సీటులో మధ్య ప్రయాణికులకు సరైన లెగ్‌రూమ్ కోసం ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది. క్యాబిన్ అనేది క్రోమ్-ఫినిష్ పెడల్స్, డోర్ ట్రిమ్‌లతో పూర్తిగా బ్లాక్ కలర్ లెథెరెట్ అప్హోల్స్టరీతో చాలా అందంగా కనిపిస్తుంది.
ఫీచర్స్
ఈ XUVలో లెథెరెట్ (Leatherette) సీట్లు, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ & గేర్ లివర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, అడాప్టివ్ గైడ్‌లైన్స్‌తో రియర్ పార్కింగ్ కెమెరా, 7-అంగుళాల ఫెదర్-టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే & బ్లూసెన్స్ కనెక్షన్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ORVMs, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్
XUV300 TurboSport గ్లోబల్ NCAP ద్వారా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. 4-డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్‌తో కూడిన ESP, ABS, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్, ISOFIX సీట్లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ వంటి అనేక అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ వీటిలో ఆఫర్ చేశారు.
వేటికి పోటీ
హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి వాటికి ఇది పోటీ ఇస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, CAR, Mahindra, Mahindra and mahindra, New car