హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra XUV300: మహీంద్రా XUV 300 నుంచి కొత్త వేరియంట్‌.. త్వరలో ఇండియాలో లాంచ్.. వివరాలిలా..

Mahindra XUV300: మహీంద్రా XUV 300 నుంచి కొత్త వేరియంట్‌.. త్వరలో ఇండియాలో లాంచ్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొత్త వేరియంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో సమాచారం లీక్‌ అయింది. ఇటీవల ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించిన మోడల్‌ తరహాలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొత్త వేరియంట్‌ ఉండబోతోందని చర్చలు జరుగుతున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300(Mahindra XUV 300) కొత్త వేరియంట్‌కు(New Variant) సంబంధించి ఆన్‌లైన్‌లో(Online) సమాచారం లీక్‌ అయింది. ఇటీవల ఆటో ఎక్స్‌పో 2020లో(Auto Expo 2020) ప్రదర్శించిన మోడల్‌ తరహాలో మహీంద్రా ఎక్స్‌యూవీ300(Mahindra XUV 300) కొత్త వేరియంట్‌ ఉండబోతోందని చర్చలు జరుగుతున్నాయి. లీక్‌(Leak) అయిన సమాచారం ఆధారంగా త్వరలోనే ఈ మోడల్‌ ఇండియాలో లాంచ్‌(India Launch) కానుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొత్త ‘స్పోర్ట్జ్’ ట్రిమ్‌లో XUV300ని పరిచయం చేయాలని కంపెనీ(Company) యోచిస్తోంది. కొత్త వేరియంట్‌ను రాబోయే కొద్ది వారాల్లో దేశంలో లాంచ్‌(Launch) చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే మోడల్‌ను ఆటో ఎక్స్‌పో 2020లో(Auto Expo 2020) కూడా కంపెనీ ప్రదర్శించింది.

ప్రస్తుతం ఈ మోడల్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌లు(Documents) లీక్‌ అయ్యాయి. ఆన్‌లైన్‌లో కొత్త మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సూచనలతో వీలైనంత త్వరగా మహీంద్రా XUV300 కొత్త వేరియంట్‌(Variant) లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

లీక్‌ అయిన వివరాల మేరకు.. XUV300 స్పోర్ట్జ్ ఎడిషన్‌లో పవర్ అవుట్ 128bhp ఉంటుంది. కారు మొత్తం నాలుగు రకాలైన W4, W6, W8, W8(O)లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది చాలావరకు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్‌ శక్తిపై పని చేస్తుంది, ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్‌లో కూడా ఈ మోడల్‌నే కంపెనీ ప్రదర్శించింది. ఇంజిన్‌ ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లతో వస్తున్నట్లు సమాచారం. రాబోయే వెర్షన్ ముందుగా ప్రదర్శించిన XUV300 Sportz తరహాలోనే ఉంటే.. అది బాడీ డీకాల్స్, 'Sportz' బ్యాడ్జింగ్‌తో సహా అనేక ఎక్స్‌టెర్నల్‌ హైలైట్‌లను పొందవచ్చు. క్యాబిన్ లోపల ఇది డ్యాష్‌బోర్డ్, మధ్యలో ఎరుపు రంగు ఇన్సర్ట్‌లతో పాటు పూర్తిగా బ్లాక్-అవుట్ థీమ్‌తో రూపొందుతుంది. కన్సోల్, అలాగే స్టీరింగ్ వీల్ కూడా ఉంటాయి.

Save Electricity Bill: మీ ఇంటి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా..? ఈ 5 టిప్స్‌తో బిల్లు తగ్గించుకోండి..


మహీంద్రా XUV300 స్పోర్ట్జ్ భారతదేశంలో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ వెన్యూ 1.0 టర్బో, కియా సోనెట్ 1.0 టర్బో వంటి సబ్-కాంపాక్ట్ SUVల స్పోర్టియర్ ట్రిమ్‌ల నుంచి పోటీని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ వంటి రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్‌లు, ట్రాన్స్‌మిషన్‌లో మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ను సెలక్ట్‌ చేసుకునే సదుపాయం ఉంది.

AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

మహీంద్రా త్వరలో భారతదేశంలో కొత్త తరం స్కార్పియోను అధికారికంగా లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. స్కార్పియో వేరియంట్‌లకు ఇండియాలో గొప్ప ఆదరణ లభించింది. చాలా మంది ఈ కారును ఇష్టపడ్డారు. చాలా మంది ఎప్పటి నుంచో స్కార్పియో కొత్త వేరియంట్‌ లాంచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. స్కార్పియో అపడేటెడ్ వేరియంట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఈ నెలాఖరులో ఈ కారు విక్రయాలను భారతదేశంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Mahindra, New cars, Variant, Xuv

ఉత్తమ కథలు