హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra XUV700: మహీంద్రా ఎక్స్​యూవీ 700 లాంచ్.. రూ .11.99 లక్షల ధరతో అదిరిపోయే ఫీచర్లు

Mahindra XUV700: మహీంద్రా ఎక్స్​యూవీ 700 లాంచ్.. రూ .11.99 లక్షల ధరతో అదిరిపోయే ఫీచర్లు

రూ. 12 లక్షల్లోపే మహీంద్ర ఎక్స్‌యూవీ 700లో అదిరిపోయే ఫీచర్లు (PC; News18)

రూ. 12 లక్షల్లోపే మహీంద్ర ఎక్స్‌యూవీ 700లో అదిరిపోయే ఫీచర్లు (PC; News18)

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా తన సరికొత్త ఎస్​యూవీ వేరియంట్ ‘ఎక్స్‌యూవీ 700’ ను ఆవిష్కరించింది. ఎంతో కాలంగా ఎదురు ?

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా తన సరికొత్త ఎస్​యూవీ వేరియంట్ ‘ఎక్స్‌యూవీ 700’ ను ఆవిష్కరించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కారును సరిగ్గా భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు విడుదల చేయడం విశేషం. ఈ వేరియంట్​ కేవలం రూ .11.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించనుంది. ఇది మొత్తం ఐదు, ఏడు సీట్ల ఎంపికలో వస్తుంది. XUV700 వేరియంట్ ఎమ్​ఎక్స్​, ఏఎక్స్​ అనే రెండు ట్రిమ్‌ వేరియంట్లలో లభించనుంది. AX ట్రిమ్ స్పెక్ట్రమ్ వేరియంట్​ను AX3, AX5, AX7 మోడల్స్​లో విభజించారు. వీటిలో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను అందించారు. రాబోయే పండుగ సీజన్‌కు ముందు దీని బుకింగ్స్​ ప్రారంభమవుతాయి.

మహీంద్రా ట్విన్ పీక్స్​ లోగోతో వచ్చిన మొట్టమొదటి ఎస్​యూవీ ఇదే కావడం విశేషం. భారత్, అంతర్జాతీయ విపణుల కోసం ఈ ఎస్​యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది. ​ XUV700 రెండు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. మొదటి ఇంజిన్​ 185 PS, 420 Nm (MT) టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, రెండో ఇంజిన్​ 200 PS , 450 Nm (AT) టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. వీటికి అదనంగా 380 Nm టార్క్​ను ఉత్పత్తి చేసే టర్బోచార్జిడ్​ డీజిల్ ఇంజిన్​ను కూడా చేర్చింది. ఈ మూడు ఇంజిన్లు జిప్, జాప్, జూమ్ డ్రైవ్ మోడ్‌లతో పనిచేస్తాయి.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ధరలు

ధరల విషయానికి వస్తే.. MX పెట్రోల్ వేరియంట్ ధర రూ .11.99 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. MX డీజిల్ వేరియంట్​- రూ .12.29 లక్షల వద్ద లభిస్తుంది. AX3 పెట్రోల్ వేరియంట్​- రూ .13.99 లక్షలు, AX5 పెట్రోల్ వేరియంట్​- రూ .14.99 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంటాయి.

* స్పెసిఫికేషన్లు

ఎమ్​ఎక్స్​ సిరీస్

ఈ వేరియంట్​ 20.32 cm (8 ") ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్​తో వస్తుంది. దీనిలో 17.78 cm క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, ఎల్​ఈడీ టెయిల్‌ల్యాంప్, స్టీరింగ్ మౌంటెడ్ స్విచ్‌లు, పవర్ అడ్జెస్టెడ్​ ORVM టర్న్ ఇండికేటర్, డే నైట్ IRVM, R17 స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లను అందించింది.

అడ్రినోఎక్స్ ఏఎక్స్​ 3

ఈ వేరియంట్​ డ్యూయల్ హెచ్​డీ 10.25 ఇన్ఫోటైన్‌మెంట్ & 10.25 డిజిటల్ క్లస్టర్​తో వస్తుంది. దీనిలో అమెజాన్ అలెక్సా బిల్ట్-ఇన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, అడ్రినో ఎక్స్​ 60+ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇక, ఆరు స్పీకర్లతో అద్బుతమైన మ్యూజింగ్​ సిస్టమ్​ను ఆస్వాదించవచ్చు. LED DRL, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కవర్లతో కూడిన R17 స్టీల్ వీల్స్ వంటివి అందించింది.

ఏఎక్స్​ 5

స్కైరూఫ్, R17 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్​, LED క్లియర్-వ్యూ హెడ్‌ల్యాంప్స్​, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, కార్నర్ లైట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఏఎక్స్​ 7

అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, డ్రైవర్ డ్రౌజీనెస్​ అలర్ట్, స్మార్ట్ క్లీన్ జోన్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, R18 డైమండ్ కట్ అల్లాయ్, లీథరెట్ సీట్, లెదర్ స్టీరింగ్ & గేర్ లివర్, మెమరీ, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ వంటి ఫీచర్లతో ఈ వేరియంట్‌ను అభివృద్ధి చేశారు.

Published by:John Kora
First published:

Tags: CAR, Mahindra and mahindra

ఉత్తమ కథలు