Home /News /business /

MAHINDRA XUV 400 IS THE ALL ELECTRIC VERSION OF THE XUV 300 WHICH WILL BE LAUNCHED ON SEPTEMBER 6 GH SRD

Mahindra XUV 400 EV: మహీంద్రా నుంచి భారీ ఎలక్ట్రిక్ వెహికల్.. లాంచ్, ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Mahindra XUV 400 EV

Mahindra XUV 400 EV

Mahindra XUV 400 EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో రాణించేందుకు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో రాణించేందుకు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఆగస్టు 15న జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ‌ కార్లను పరిచయం చేసింది. వీటిలో ఎలక్ట్రిక్ XUV 400 EV మోడల్‌ను సెప్టెంబర్ 6న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 400 మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ కావడం గమనార్హం. మిడ్-సైజ్‌లో పాపులర్ అయిన SUV XUV 300కు ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఎక్స్‌యూవీ 400 రాబోతుంది.

* డిజైన్
రాబోయే ఎలక్ట్రిక్ SUV స్పై ఫోటోలను పరిశీలిస్తే 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన eXUV300 కాన్సెప్ట్ నుంచి కొత్త డిజైన్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు ఆటోకార్ పోర్టల్ పేర్కొంది. కాగా, XUV 400ను మొదటిసారిగా ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. అలాగే KUV మోడల్‌లో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా అదే సమయంలో పరిచయం చేసింది ఎం అండ్ ఎం కంపెనీ.

* స్పెసిఫికేషన్స్
సబ్-4-మీటర్ XUV 300తో పోలిస్తే ఎలక్ట్రిక్ SUV 4.2 మీటర్ల పొడవుతో వస్తుందని మహీంద్రా ధ్రువీకరించింది. పెరిగిన క్యాబిన్ పొడవుతో బూట్‌లో ప్రయాణికులకు స్థలాన్ని పెంచే అవకాశం ఉంది. XUV 400 ఈవీ.. మహీంద్రా XUV700లోని సరికొత్త టెక్ అండ్ ADAS ఫీచర్లతో లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన కొత్త హెడ్‌లైట్, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, టెయిల్ ల్యాంప్స్ కోసం కొత్త డిజైన్, రీప్రొఫైల్డ్ టెయిల్‌గేట్ వంటి కొన్ని డిజైన్ అప్‌గ్రేడ్స్ రాబోయే SUVలో కూడా ఉండే అవకాశం ఉంది.

XUV 400కు సంబంధించి మునుపటి స్పై షాట్‌లలో ఒకటి, రీడిజైన్ లైటింగ్ ఎలిమెంట్‌లతో అప్‌డేట్ అయిన LED టైల్‌లైట్ ఉన్నట్లు నిర్ధారించింది. XUV 400లో ఇన్ఫోటైన్‌మెంట్ డ్యూటీస్‌ను హ్యాండిల్ చేయడానికి బ్రాండ్ Adreno X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :  అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో నాలుగు బీఎండబ్ల్యూ బైక్స్ లాంచ్.. ధరల వివరాలివే..

మెకానికల్ విషయానికి వస్తే SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో, 150 bhp అవుట్‌పుట్‌ను డెలివరీ చేయనుంది. ఈ కారు ఒక ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని ఆటో మొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మహీంద్రా XUV 400 EV మోడల్ టాటా నెక్సాన్ EVకు పోటీగా భారత మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ. 15లక్షలు ఉండే అవకాశం ఉంది.

కాగా, పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఏకంగా ఐదు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు మహీంద్రా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ఐదు వాహనాలను గత సోమవారం ఆవిష్కరించింది. 2024లో తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని, 2026లో మిగిలిన వాహనాలను తీసుకురానున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వీటిని తీసుకురానున్నట్లు సంస్థ చైర్మన్ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Electric cars, Electric Vehicles, Mahindra and mahindra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు