హోమ్ /వార్తలు /బిజినెస్ /

Thar SUV 4x4: త్వరలో రానున్న మహీంద్రా కొత్త థార్ ఎంట్రీ-లెవల్ 4x4 వేరియంట్‌.. దాని ప్రత్యేకతలు ఇవే..

Thar SUV 4x4: త్వరలో రానున్న మహీంద్రా కొత్త థార్ ఎంట్రీ-లెవల్ 4x4 వేరియంట్‌.. దాని ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా ప్రస్తుతం థార్ SUV కొత్త ఎంట్రీ-లెవల్ వెర్షన్‌ను 4x4 సామర్థ్యంతో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న థార్ 4x4 కంటే తక్కువ ధరతో వస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా (Mahindra and Mahindra) అద్భుతమైన డిజైన్లతో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీలు లాంచ్ చేస్తూ సూపర్ పాపులర్ అయింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన SUVలలో బొలెరో తర్వాత థార్ ఎస్‌యూవీ (Thar SUV)కి వచ్చిన పాపులారిటీ మరే SUVకి రాలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆఫ్-రోడ్, అడ్వెంచర్ డ్రైవ్స్‌కి వెళ్లే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వాల్యూ-ఫర్-మనీ కారుకు ఎంట్రీ లెవెల్‌లో శక్తివంతమైన వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ వడివడిగా అడుగులు వేస్తోంది. మహీంద్రా ప్రస్తుతం థార్ SUV కొత్త ఎంట్రీ-లెవల్ వెర్షన్‌ను 4x4 సామర్థ్యంతో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న థార్ 4x4 కంటే తక్కువ ధరతో వస్తుంది. 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది.

4x4 SUVలో బెస్ట్ ఆప్షన్‌

ఈ లాంచ్ మారుతి సుజుకి జిమ్నీకి పోటీగా రానున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా ఆఫ్-రోడ్ సామర్థ్యం గల SUV. ఇక థార్ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్ తక్కువ ధరల్లో దొరికే 4x4 SUV కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఛాయిస్ అవ్వచ్చు. ఈ కొత్త వేరియంట్‌కు AX AC అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఇక్కడ 4x4 అంటే ఇంజన్లు నాలుగు చక్రాలకు పవర్ అందించడం అని అర్థం. అంటే ఈ వేరియంట్ 4x2 వేరియంట్ కంటే ఎక్కువ పవర్‌తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం థార్ ఎస్‌యూవీ 4x2, 4x4 అనే రెండు రకాల వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. కాగా 4x2 ధర 4x4 కంటే సుమారు రూ.2 లక్షలు తక్కువగా ఉంది. అయితే ఇది 4x4 వలె ఆఫ్-రోడింగ్‌లో సమర్థవంతంగా వెళ్లలేదు. దానికి తోడు ఇందులో చిన్న డీజిల్ ఇంజన్‌ను ఇచ్చారు.

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇవే

అయితే థార్ కొత్త AX AC వేరియంట్‌లో 130hp, 300Nm పవర్ ఔట్‌పుట్స్‌ ఇచ్చే పెద్ద 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది మరింత శక్తివంతమైనది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 152hp పవర్, 300Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లకు కనెక్ట్ అయి ఉంటాయి. థార్ ఎంట్రీ-లెవల్ 4×4 వేరియంట్ ప్రస్తుత 4x4 AX(O) ట్రిమ్‌లోని కొన్ని ఫీచర్లను ఆఫర్ చేయకపోవచ్చు. కానీ ఈ వేరియంట్‌లో ప్రస్తుత మోడల్‌లో అందించిన ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్‌లు, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs), 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్లు ఉంటాయి.

AP-TS Teacher Posts: టీచర్ ఉద్యోగాలు .. డీఎస్సీ ఉద్యోగ ప్రకటల తాజా సమాచారం..

మరి థార్ ఎస్‌యూవీ కొత్త 4x4 వేరియంట్‌లో ప్రస్తుతం థార్ 4x4 హై-ఎండ్ AX(O) ట్రిమ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫీచర్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు. ఈ వ్యవస్థ లో-ట్రాక్షన్ రోడ్డు పరిస్థితులలో టైర్లకు మెరుగైన పట్టును ఆఫర్ చేస్తుంది. కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ఇది మరికొద్ది రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

First published:

Tags: Auto, Mahindra, Mahindra and mahindra