హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Thar 2020: సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో కొత్త ‘మహీంద్రా థార్’ విడుదల ఎప్పుడంటే...

Mahindra Thar 2020: సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో కొత్త ‘మహీంద్రా థార్’ విడుదల ఎప్పుడంటే...

mahindra thar (Image: Facebook)

mahindra thar (Image: Facebook)

ఆగస్టు 15న 74 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా థార్ ను విడుదల చేసింది. అక్టోబర్ 2న అధికారికంగా అమ్మకాలు మొదలవుతాయని మహీంద్రా ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుండి కారు యొక్క మొదటి యూనిట్ వేలం పారంభమైంది.

భారతదేశ ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని నూతన ఎయూవీ థార్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆగస్టు 15న 74 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా థార్ ను విడుదల చేసింది. అక్టోబర్ 2న అధికారికంగా అమ్మకాలు మొదలవుతాయని మహీంద్రా ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుండి కారు యొక్క మొదటి యూనిట్ వేలం పారంభమైంది. మహీంద్రా థార్ వాహనానికి ఇప్పటివరకు అత్యధిక ఆన్లైన్ బిడ్ రూ .79.25 లక్షలుగా నమోదైందని రష్ లేన్లో ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది.

కాగా ఈ వేలం సెప్టెంబర్ 29 వరకు కొనసాగనుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆన్లైన్ బిడ్ ధర రూ.1 కోటి దాటే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. నూతనంగా విడుదల కాబోయే ఆల్-న్యూ థార్ ఈ సిరీస్లో సెకండ్ జనరేషన్ వాహనం కానుంది. కొత్త మహీంద్రా థార్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇదివరకే మార్కెట్లో ఉన్న మహీంద్రా థార్ కారుకు అనేక నూతన ఫీచర్లను యాడ్ చేసి బీఎస్–6 ప్రమాణాలతో ఈ సెకండ్ జనరేషన్ వెహికిల్ను విడుదల చేయనుంది. కొనుగోలుదారుడు పెట్రోల్ లేదా డీజిల్ రెండు వేరియంట్లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

కొత్త మహీంద్రా థార్ డీజిల్ వేరియంట్ 2.2- లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఇది 130 హెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే 2.0 లీటర్ స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 150 హెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త తరం మహీంద్రా ధార్ 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో 6 స్పీడ్ మ్యాన్యువల్ టార్క్ కన్వర్టర్ ను పొందనుంది.

2020 మహీంద్రా థార్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లు పవర్ మరియు పర్ఫార్మెన్స్ రెండింటిలోనూ దాదాపు సమానంగా ఉంటాయి. మహీంద్రా థార్ కొత్త కారు పాత కారుతో పోలిస్తే సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, రీడిజైన్ లుక్ తో విడుదల కానుంది. కొత్త మహీంద్రా థార్లో డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ క్లాక్, ఎలక్ట్రానిక్ మల్టీ ట్రిప్మీటర్ ఉన్నాయి. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో పాటు వినైల్ సీట్ అప్హోల్సట్రరీ మరియు మోనోక్రోమ్ ఎంఐడీ డిస్ప్టేతో మార్కెట్లో విడుదల కానుంది. కాగా, మహీంద్రా కంపెనీ ఇప్పటివరకు తమ నూతన మహీంద్రా థార్ ధరను అధికారికంగా వెల్లడించలేదు.

First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు