Mahindra Thar SUV: మహీంద్రా థార్ ఎస్​యూవీ ధరల పెంపు.. ఈ ఏడాదిలో మూడోసారి..

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా థార్ ఎస్​యూవీకి మంచి క్రేజ్​, విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అమ్మకాల్లోనూ ఈ పవర్​ఫుల్ ఎస్​యూవీ జోరు చూపిస్తోంది. ఈ వాహనాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

  • Share this:
మహీంద్రా థార్ ఎస్​యూవీకి మంచి క్రేజ్​, విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అమ్మకాల్లోనూ ఈ పవర్​ఫుల్ ఎస్​యూవీ జోరు చూపిస్తోంది. ఈ వాహనాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో థార్ డెలివరీ కోసం నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో థార్​తో పాటు మరికొన్ని మోడల్స్​ ధరలను మహీంద్రా సంస్థ పెంచింది. ఇందులో థార్ ధర అధికంగా పెరిగింది. ఈ ఎస్​యూవీలోని వివిధ మోడళ్లపై ధరలను రూ.32 వేల నుంచి రూ.92వేల వరకు పెంచుతున్నట్టు మహీంద్రా ప్రకటించింది. థార్ ఎస్​యూవీలను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ తెలిపింది. అయితే సప్లయ్ కంటైనర్ల కొరత కూడా ఉందని ప్రకటించింది.

కార్ల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని మహీంద్రా ప్రకటించింది. పెంచిన ధరలు జూలై నుంచే అమలులోకి రానున్నాయి. 2021లో మహీంద్రా తన మోడళ్లపై ధరలు పెంచడం ఇది మూడోసారి. తొలుత ఫిబ్రవరిలో ధరల పెంపుపై ప్రకటన చేసిన కార్ల తయారీ సంస్థ.. మరోసారి మేలోనూ రేట్లను పెంచింది.

ధర ఎంత పెరిగినా థార్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సాఫ్ట్​టాప్​, కన్వర్టబుల్ అండ్ హార్డ్​టాప్​తో థార్ బాడీ స్టయిల్ ఎంతో ఆకట్టుకుంటోంది. లుక్స్​తో పాటు పవర్​ఫుల్ ఇంజిన్ కూడా ఆకర్షిస్తోంది. థార్​ మోడల్ పెట్రోల్​, డీజిల్ ఆప్షన్లలో వస్తోంది. 2.2 లీటర్​ టర్బోచార్జ్​డ్​ డీజిల్ ఇంజిన్​.. గరిష్ఠంగా 130 పీఎస్ పవర్​ను, 320ఎన్​ఎం పీక్​ టార్ర్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 2.0 లీటర్ టర్బోచార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్ 150 పీఎస్ గరిష్ఠ పవర్​ను 320 ఎన్​ఎం పీక్ టార్క్యూను జెనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మ్యానువల్​, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్​బాక్స్ ఆప్షన్ల్ ఉన్నాయి. మహీంద్రా థార్ ధర మోడళ్లను బట్టి రూ.15.13 (ఢిల్లీలో ఆన్​రోడ్​ ధరలు) నుంచి రూ.18.19 లక్షల మధ్య ఉంటుంది.

అలాగే మరిన్ని కార్ల మోడళ్లపైనే మహీంద్రా సంస్థ ధరలు పెంచింది. బొలెరో, మారాజో, స్కార్పియో, ఎక్స్​యూవీ 300 మోడళ్ల రేట్లను కూడా అధికం చేసింది. అయితే ఈ మోడళ్లపై ధర రెండు నుంచి మూడు శాతం మాత్రమే పెరిగింది. మరోవైపు మహీంద్రా ఎక్స్​యూవీ 500తో పాటు ఆల్ట్రాజ్​ జీ4, కేయూవీ 100 మోడళ్లు త్వరలో డిస్కౌంట్లలో వచ్చే అవకాశం కూడా ఉంది.
Published by:Sumanth Kanukula
First published: