Thar RWD : దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా లాంచ్ చేసిన థార్ మోడల్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఈ మోడల్ కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే తాజాగా ఈ పాపులర్ మోడల్‌లో సరికొత్త ఎడిషన్‌ను మహీంద్రా లాంచ్ చేసింది. థార్ ఆర్‌డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ.9.99 లక్షలు- రూ. 13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ప్రైస్ మాత్రమే. తొలి 10 వేల బుకింగ్స్‌కి మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది.
రెండు కలర్ ఆప్షన్స్
ఈ సరికొత్త కారు మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. AX(O) RWD– డీజిల్ MT హార్డ్ టాప్ ధర రూ.9.99 లక్షలు(ఎక్స్-షోరూమ్). LX RWD– డీజిల్ MT హార్డ్ టాప్ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). LX RWD పెట్రోల్ AT హార్డ్ టాప్ ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో ఈ థార్ లభిస్తోంది. ఈ కొత్త కలర్స్‌లో థార్ లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంజిన్ కెపాసిటీ వివరాలు
డీజిల్ వేరియంట్‌లో(మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) సరికొత్త D117 CRDe ఇంజిన్ ఉంటుంది. ఇది 117 BHP, 300 Nm టార్క్ (87.2 kW@3500 rpm)ను ప్రొడ్యూస్ చేస్తుంది. గ్యాసోలిన్ వేరియంట్(ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్)లో mStallion 150 TGDi ఇంజిన్ ఉంటుంది. ఇది 150 BHP, 320 Nm టార్క్ (112 kW@5000 rpm)ను ప్రొడ్యూస్ చేస్తుంది.
అదనపు ఫీచర్స్
18 అంగుళాల అలోయ్ వీల్స్, ఆల్- టెర్రైన్ టైర్స్, ఈఎస్పీ మౌల్డ్డెడ్ ఫుట్‌స్టెప్స్, క్రూయిజ్ కంట్రోల్, బ్లాక్ బంపర్స్, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్, ఫాగ్ లైట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రూఫ్- మౌంటెడ్ స్పీకర్ వంటి ఫీచర్స్ థార్ 2డబ్ల్యూడీలో ఉన్నాయి.
గత మోడల్‌కు కొత్త హంగులు
గత మోడల్ థార్ 4WD లో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్-లాకింగ్ డిఫరెన్షియల్‌తో ఇది వస్తుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను ఇష్టపడే వారికి LX డీజిల్ 4WD వేరియంట్‌ల్లో ఇది ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుంది. 4WD పవర్‌ట్రైన్ లైనప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మోడల్‌లోని 2.0L mStallion 150 TGDi పెట్రోల్ ఇంజిన్ ద్వారా 150 bhp, 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది . 2.2L mHawk 130 డీజిల్ ఇంజన్ 130 bhtor N, 130 bh torque పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahindra, Mahindra and mahindra