Force Gurkha: ఫోర్స్ మోటార్స్ నుంచి గూర్ఖా ఎస్​యూవీ లాంచ్.. మహీంద్రా థార్​ను తలదన్నే లుక్​, ఫీచర్లు!

New Force Gurkha 2021

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్​లోకి గూర్ఖా స్పోర్ట్స్ యుటిలిటీ ఎస్​యూవీని అధికారికంగా లాంచ్​ చేసింది. దీన్ని మహీంద్రా థార్​కు పోటీగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌ రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

  • Share this:
ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్​లోకి గూర్ఖా స్పోర్ట్స్ యుటిలిటీ ఎస్​యూవీని అధికారికంగా లాంచ్​ చేసింది. దీన్ని మహీంద్రా థార్​కు పోటీగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌ రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే వీటి​ బుకింగ్స్​ ప్రారంభయ్యాయి. ఈ గూర్ఖా వేరియంట్​ను రూ. 25 వేలు చెల్లించి డీలర్​షిప్ సెంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ డెలివరీలు అక్టోబర్​ 15 నుంచి ప్రారంభమవుతాయని ఫోర్స్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో కస్టమర్లు గూర్ఖా టెస్ట్ డ్రైవ్​ కూడా చేసుకోవచ్చు.

No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఉన్న అసలు మతలబేంటో తెలుసా?


గ్రౌండ్- అప్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ కొత్త గుర్ఖా వేరియంట్ బీఎస్ -VI కంప్లైంట్ 2.6 లీటర్ (91 హెచ్) డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది​ మొత్తం 5 కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రెడ్​, గ్రీన్​, వైట్​, ఆరెంజ్​, గ్రే కలర్స్​లో లభిస్తుంది. మెర్సిడెస్ జి-వాగెన్ ప్రేరణతో దీన్ని రూపొందించారు. దీనిలో విశాలమైన పొడవైన బాడీ, సరికొత్త ఇంటీరియర్​ డిజైన్​, కొత్త క్రాష్ కంప్లైంట్ వంటి ఫీచర్లు అందించింది. ఇక, కఠినమైన గ్రామీణ రోడ్లపై కూడా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటం కోసం సి ఇన్​ సి చాసిస్​, నాలుగు చక్రాలపై కొత్త కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ వంటివి చేర్చింది.

Second Hand Car కొంటున్నారా..ముందు వాడండి..తర్వాత చెల్లించండి..Ola Cars బంపర్ ఆఫర్..


ఫోర్స్​ గూర్ఖాలో అధునాతన ఫీచర్లు..

గూర్ఖా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 2.6 లీటర్​ 91 బీహెచ్​పీ మెర్సిడెస్​ డిరైవ్డ్​ కామన్​ రైల్​, డైరెక్ట్​ ఇంజెక్షన్​, టర్బో చార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​, 5 స్పీడ్​ మెర్సిడెస్​ జి–28 ట్రాన్స్​మిషన్​, రెండు ఎయిర్​ బ్యాగ్స్​, ఏబీఎస్​, ఈబీడీ, టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ వంటివి పొందుపర్చారు. వీటితో పాటు టిల్ట్, టెలిస్కోపిక్​ అడ్జస్ట్​మెంట్​తో స్టీరింగ్​, 500 లీటర్ల బూట్​ స్పేస్​, పవర్​ విండోస్​, సెంట్రల్​ లాకింగ్​, స్పీడ్​ సెన్సింగ్​ డోర్​ లాక్స్​, రేర్​ పార్కింగ్​ సెన్సార్స్​, వైపర్స్​తో సింగ్​ పీస్​ రేర్​ డోర్​ వంటివి చేర్చింది. ఆన్-రోడ్ సహాయం కోసం 6,200 టచ్ పాయింట్లను కలిగి ఉన్న ఆటో యూరోపా ఇండియా సంస్థతో జతకట్టినట్లు ఫోర్స్ మోటార్స్ తెలిపింది.
Published by:Krishna Adithya
First published: