Home /News /business /

MAHINDRA THAR PRICES INCREASED BY UPTO RS 40000 WAITING PERIOD NOW EXCEEDS 10 MONTHS MK GH

Mahindra Thar: భారీగా పెరిగిన మహీంద్రా సెకండ్ జనరేషన్ థార్‌ ఎస్‌యూవీ కార్ల ధరలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన ఎస్‌యూవీ, సెకండ్ జనరేషన్ థార్ (second generation Thar) కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనికి డిమాండ్ పెరగడంతో, మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత మొదటిసారి థార్ ధరలను పెంచుతున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభాల బాటలో పయనిస్తోంది. కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో కొన్ని సంస్థలు ధరలు పెంచుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన ఎస్‌యూవీ, సెకండ్ జనరేషన్ థార్ (second generation Thar) కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనికి డిమాండ్ పెరగడంతో, మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత మొదటిసారి థార్ ధరలను పెంచుతున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ మోడల్‌లో ఉన్న వివిధ వేరియంట్లపై రూ.20,337 నుంచి రూ.40,338 వరకు ధరల పెరుగుదల ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. 2020 నవంబర్ 30కు ముందు బుక్ చేసుకున్న వాహనాల ధరలు మాత్రం పెంచలేదు. కానీ వీటి బుకింగ్‌లో మార్పుల కోసం కంపెనీకి దరఖాస్తు చేసుకున్న కొనుగోలుదారుల ఆర్డర్లు మాత్రం కొత్త ఆర్డర్‌ కిందకే రానున్నాయి. దీంతో వీటిపై కూడా పెరిగిన ధరలే అమల్లో ఉండనున్నాయి.

సెకండ్ జనరేషన్ థార్‌కు ఊహించని రీతిలో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు 30,000 యూనిట్ల బుకింగ్‌లు నమోదైనట్లు కంపెనీ చెబుతోంది. కొత్త థార్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మోటార్, 2.2 లీటర్ టర్బో డీజిల్ వంటి రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ అత్యధికంగా 150 PS శక్తిని, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టర్బో డీజిల్ ఇంజిన్ 130 PS శక్తిని, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోడళ్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్, మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

పెరిగిన వెయిటింగ్ పీరియడ్
మహీంద్రా సంస్థ ఈ ఎస్‌యూవీని AX Std, AX, AX (O), LX అనే నాలుగు మోడళ్లలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ లాంచ్ చేసిన రెండు నెలల తర్వాత తక్కువ ధరలు ఉన్న AX STD(రూ.9.80 లక్షలు), AX పెట్రోల్ వెర్షన్‌(రూ.10.65 లక్షలు)ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం ఉన్న మోడళ్ల ప్రారంభ ధర రూ.11.90 లక్షలుగా ఉంది. పెరిగిన ధరలతో కొత్త థార్‌ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.12.10 లక్షలకు పెరిగింది. వీటిలో LX డీజిల్ వేరియంట్‌ ధర అత్యధికంగా రూ.13.75 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలతో దీని విలువ రూ.14.15 లక్షలకు చేరుకుంది. ఈ సిరీస్‌లోని కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉండటంతో వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పెంచాల్సి వచ్చింది. గతంలో 4, 5 నెలలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను గత నవంబర్‌లో 7 నెలలకు, ప్రస్తుతం 10 నెలలకు పెంచామని కంపెనీ తెలిపింది.
Published by:Krishna Adithya
First published:

Tags: CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు