హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Car Offers: స్టాక్ క్లియరెన్స్ సేల్... మహీంద్రా కార్లపై రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్

Mahindra Car Offers: స్టాక్ క్లియరెన్స్ సేల్... మహీంద్రా కార్లపై రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్

(Image source: Mahindra)

(Image source: Mahindra)

Mahindra Stock Clearance | మహీంద్రా కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టాక్ క్లియరెన్స్ సేల్ ప్రకటించింది కంపెనీ. రూ.3 లక్షలకు పైనే ఆఫర్స్ ప్రకటిస్తోంది.

భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ‘స్టాక్ క్లియరెన్స్ సేల్’లో భాగంగా ఎంచుకున్న ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు డిసెంబర్ నెల అంతటా అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. డిస్కౌంట్లలో భాగంగా ఎంపిక చేసిన డీలర్షిప్లలో రూ.3.06 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ వంటివి అందిస్తుంది. కరోనా ప్రభావంతో ఈ ఏడాది తమ అమ్మకాల్లో భారీ క్షీణతను ఎదుర్కొన్నాయి వివిధ ఆటోమొబైల్ కంపెనీలు. దీంతో తయారీదారులు, డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను త్వరగా క్లియర్ చేసుకోవడానికి వివిధ కార్ల తయారీ సంస్థలు ఇయర్ ఎండ్ సేల్ని నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

కార్లపై మహీంద్రా అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఇవే


Mahindra Alturas G4: మహీంద్రా అల్టురాస్ జి4 కారు కొనుగోలుపై రూ.2.20 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.16 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన యాక్సెసరీస్ పొందవచ్చు.

Mahindra XUV500: XUV500 W5, XUV500 W7 రెండు వేరియంట్ల కొనుగోళ్లపై రూ.13,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన యాక్సెసరీస్‌ను పొందవచ్చు.

Mahindra Scorpio: స్కార్పియో ఎస్ 5 మోడల్‌పై మహీంద్రా కంపెనీ రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10,000 విలువైన యాక్సెసరీస్‌ను పొందవచ్చు.

Mahindra Bolero: మహీంద్రా బొలెరో SUV మోడల్‌పై రూ.6,500 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి లభిస్తాయి.

Sabarimala: శబరిమల వెళ్లాలనుకుంటున్నారా? అయ్యప్ప భక్తులకు ఆలయబోర్డు శుభవార్త

SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

Mahindra Marazzo: మహీంద్రా మారజో కొనుగోలుపై రూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5 వేల విలువైన యాక్సెసరీస్ వంటివి లభిస్తాయి.

Mahindra XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్లోని పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై వేర్వేరు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. పెట్రోల్ ఇంజన్ మోడళ్లపై రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. డీజిల్ వేరియంట్పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.6,550 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ను పొందవచ్చు. కాగా, నూతనంగా విడుదలైన మహీంద్రా థార్, KUV100 NXT మోడళ్లపై ఎటువంటి ఆఫర్లను ప్రకటించలేదు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు