మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) 2022 ఎడిషన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ నుంచి వస్తున్న ఈ కొత్త ఎస్యూవీ(SUV) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు, డిజైన్, మల్టిపుల్ అప్డేట్స్ను అందిస్తోంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) 2022 ఎడిషన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ నుంచి వస్తున్న ఈ కొత్త ఎస్యూవీ(SUV) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు, డిజైన్, మల్టిపుల్ అప్డేట్స్ను అందిస్తోంది. మహీంద్రా XUV700 తర్వాత బాడీపై కంపెనీ కొత్త బ్యాడ్జ్‌ని పొందిన రెండో ఎస్యూవీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం కొనసాగుతున్న మోడల్‌తోపాటు ఈ కొత్త మోడల్‌ను కొద్దిగా భిన్నమైన పేరుతో విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న స్కార్పియో-ఎన్ వివరాలను కంపెనీ టీజర్ల ద్వారా వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ స్పెషల్ ఎస్యూవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
2022 మహీంద్రా స్కార్పియో డిజైన్
కొత్త ఎస్యూవీ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. కొత్త ఎలిమెంట్స్‌లో బోల్డ్ ఫ్రంట్ ఎండ్, కొత్త బ్యాడ్జ్‌తో వెర్టికల్ గ్రిల్, క్రోమ్ సరౌండ్‌లతో విండోస్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. మొత్తం మీద, కొత్త స్కార్పియో-ఎన్ దాని మునుపటి మోడళ్ల కంటే ఫుల్ అప్‌గ్రేడ్ అయిన పెద్ద చంకీ ఎస్యూవీ లాగా రూపొందింది.
క్యాబిన్
మహీంద్రా టీజర్ల ద్వారా స్కార్పియో-ఎన్ కొన్ని వివరాలను వెల్లడించింది. డిజైన్, టెక్నాలజీ పరంగా ఎస్యూవీ మెరుగైన ఇంటీరియర్‌తో వస్తుంది. ఎస్‌యూవీలో కొత్తగా బిగ్ స్క్రీన్, కొత్త బ్యాడ్జ్, రెండు, మూడో వరుస సీట్ల కోసం న్యూ సీటింగ్ కాన్ఫిగరేషన్ కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న వెర్షన్‌తో పోలిస్తే మెరుగైన-కనెక్ట్ ఫీచర్లను అందించనుంది.
వెహికల్ సేఫ్టీ
దీని లేడర్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ నిజమైన ఎస్యూవీ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. కొత్త స్కార్పియోలో కూడా ఆధునిక ఎట్ బుచ్ స్టైలింగ్ సంప్రదాయాన్ని కొనసాగించారు. కొత్త తరం అవతార్ పూర్తిగా కొత్త లేడ్-ఫ్రేమ్ ఛాసిస్‌తో ముందుకు దూసుకుపోతుందని మహీంద్రా తెలిపింది. క్రాష్ టెస్ట్ ఫెసిలిటీలో కొత్త స్కార్పియో-ఎన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ఇంజిన్
రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ప్యాకేజీలో 2.2L ఆయిల్ బర్నర్, 2.0L టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంటాయి. 4x4 డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇది కేవలం డీజిల్ వేరియంట్లలో మాత్రమే లభించే అవకాశం ఉంది.
ధర
ధరల పరంగా చూస్తే.. ఎంట్రీ లెవల్ పెట్రోల్ ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12 లక్షల నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. టాప్-ఆఫ్-లైన్ మోడల్ ధర రూ.20 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు పెరగవచ్చు. అయితే కంపెనీ ఈ వెహికల్‌ను అధికారికంగా లాంచ్ చేసిన తర్వాతే, దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.