Scorpio Price | మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? కార్ల ధరలు పెరిగాయి. దిగ్గజ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తాజాగా కార్ల ధరలను భారీగా పెంచేసింది. కార్ల ధర ఏకంగా రూ .లక్ష వరకు పైకి చేరింది. దీంతో కొత్త ఏడాదిలో కొత్తగా మహీంద్రా కారు (Car) కొనుగోలు చేయాలని భావించే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
మహీంద్రా కంపెనీ తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో ఎన్ ధరను పెంచేసింది. రేట్ల పెంపు కారణంగా కస్టమర్లు ఇప్పుడు కొత్త స్కార్పియో కొనుగోలు చేయాలని భావిస్తే.. రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ధరల పెంపు అనేది కారు వేరియంట్ ప్రాతిపదికన మారుతుందని గుర్తించుకోవాలి.
బ్యాంక్ కస్టమర్లకు ఆర్థిక శాఖ శుభవార్త.. కీలక ప్రకటన!
కాగా మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఒకటి. అలాగే 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన మరొకటి. ఈ రెండు కార్లలోనూ 6 స్పీడ్ మ్యానువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. మీరు మీకు నచ్చిన వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ కారులో 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, డ్యూయెల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ సింగిల్ పాన్ సర్ రూఫ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహిళలకు ఎస్‌బీఐ అదిరే స్కీమ్.. ఈజీగా రూ.10 లక్షల లోన్, అర్హతలు ఇవే!
ఇంకా ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మహీంద్రా కారు ధరల పెంపును గమనిస్తే.. జెడ్ 8 4డబ్ల్యూడీ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 1.01 లక్షల దాకా రేటు పెరిగింది. ఇదివరకు ఈ కారు రేటు రూ. 19.94 లక్షలుగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ కారు కొనాలంటే రూ. 20.95 లక్షలు చెల్లించుకోవాలి. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. అలాగే మహీంద్రా స్కార్పియోలో టాప్ వేరియంట్ ధర రూ. 24.08 లక్షలుగా ఉంది. ఈ కారు ధర తక్కువగా పెరిగింది. కార్ల ధరల పెంపు తర్వాత చూస్తే.. ఇప్పుడు స్కార్పియో కారు ప్రారంభ ధర రూ. 12.74 లక్షలుగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, Car prices, Cars, Mahindra, Mahindra and mahindra, Price Hike, Scorpio