Home /News /business /

MAHINDRA SCORPIO N EXTERIORS UNVEILED LAUNCH SCHEDULED FOR JUNE 27 GH VB

Mahindra Scorpio-N: స్కార్పియో-ఎన్ ఎక్స్‌టీరియర్‌ ఫొటోలు ఆవిష్కరించిన మహీంద్రా.. విడుదల ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నెక్స్‌ట్‌ జనరేషన్ మహీంద్రా స్కార్పియో ఎట్టకేలకు వాహనదారులకు అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్ పార్ట్స్‌కు సంబంధించిన ఫొటోలను మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ షేర్ చేసింది. అలాగే జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్ చేస

ఇంకా చదవండి ...
నెక్స్‌ట్‌ జనరేషన్(Next Generation) మహీంద్రా స్కార్పియో(Scorpio) ఎట్టకేలకు వాహనదారులకు అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్ పార్ట్స్‌కు సంబంధించిన ఫొటోలను మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ షేర్ చేసింది. అలాగే జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. కొత్త ఎస్‌యూవీకి Z101 కోడ్‌నేమ్‌తో స్కార్పియో-ఎన్ (Scorpio-N) అని కంపెనీ పేరు పెట్టింది. మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను కరెంట్‌-జనరేషన్ స్కార్పియోతో పాటు విక్రయిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కరెంట్‌-జనరేషన్ స్కార్పియోని స్కార్పియో క్లాసిక్‌గా సేల్ చేస్తామని తెలిపింది. స్కార్పియో-ఎన్ సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో దాని ఎక్స్‌టీరియర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీమియం లుక్‌తో ఎస్‌యూవీ
మహీంద్రా కంపెనీ స్కార్పియో-ఎన్ కొత్త డిజైన్‌ను తాజాగా ఆవిష్కరించింది. దీని ప్రకారం, గత స్కార్పియో వెర్షన్లలో లాగానే ఇందులో బాక్సీ సిల్హౌట్, బుచ్ స్టాన్స్ వంటి డిజైన్ స్టైలింగ్స్‌ ఉన్నాయి. అయితే ఈ ఎస్‌యూవీ మరింత ప్రీమియం లుక్‌ను పొందింది. కొత్త సెట్ స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు ఆరు క్రోమ్ స్లేట్‌లతో అద్భుతంగా కనిపించే గ్రిల్‌తో వస్తాయి. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఫాగ్‌ల్యాంప్‌ల చుట్టూ ఉన్న బంపర్‌పై కొత్త మౌంటు ప్లేస్‌లో ఉంటాయి. కొత్త ట్విన్ పీక్స్ లోగో స్కార్పియో-ఎన్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.

ఈ ఎస్‌యూవీలో పదునైన గీతలు సాఫ్ట్‌గా అందించారు. ఈ లైన్స్ ఇప్పుడు నలుపు రంగులో సన్నగా, చక్కగా ఆకట్టుకోనున్నాయి. షోల్డర్ లైన్ సీ-పిల్లర్ వద్ద సజావుగా పైకి లేస్తుంది. మెషిన్-కట్ అల్లాయ్‌ల కొత్త సెట్ కూడా ఇందులో ఒక హైలెట్ అని చెప్పవచ్చు. స్కార్పియో-ఎన్ వెనుక భాగం డిజైన్ ఎలా ఉందో తెలియాలి. లేటెస్ట్ టీజర్‌లు ప్రస్తుత-తరం స్కార్పియో వలె నిటారుగా ఉన్న టెయిల్‌గేట్, నిలువు టెయిల్ ల్యాంప్‌లు స్కార్పియో-ఎన్‌లో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇందులో సంప్రదాయ బల్బులకు బదులుగా ఎల్ఈడీలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

లీక్‌ కాని ఇంటీరియర్స్‌ సమాచారం
ఇంటీరియర్స్‌కి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఫొటోలు బయటికి రాలేదు. లీక్‌ అయిన పిక్స్ మాత్రం చాలా విషయాలను బహిర్గతం చేశాయి. ఈ పిక్స్ ప్రకారం, నలుపు, గోధుమ అనే టూ-టోన్ కలర్స్‌తో సిల్వర్ హైలైట్‌లతో సరికొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను అందించినట్లు తెలుస్తోంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంది. దాని చుట్టూ ఏసీ వెంట్‌లు, స్విచ్‌లు ఉన్నాయి.

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలాఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే

ఈ ఎస్‌యూవీలో రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, మాన్యువల్ పార్కింగ్ లివర్, కప్ హోల్డర్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, ఎల్ఈడీ క్యాబిన్ లైటింగ్, రియర్ ఏసీ వెంట్స్, బ్లోవర్ కంట్రోల్స్, రియర్ యూఎస్‌బీ పోర్ట్ వంటివి కూడా ఇందులో ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఆల్-న్యూ స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ మహీంద్రాకి ఒక ముఖ్యమైన వాహనం అని చెప్పచ్చు. ఎస్‌యూవీ విభాగాన్ని రీడిఫైన్ చేయడానికి స్కార్పియో-ఎన్ సిద్ధంగా ఉంది. కొత్త స్కార్పియో-N XUV700 వలె అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ XUVలోని 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ 200 PS శక్తిని కలిగి ఉంటుంది. అయితే 2.2-లీటర్ mHawk టర్బో డీజిల్ ఇంజన్ 155 PS, 185 PS అనే రెండు ట్యూన్స్‌ లేదా హార్స్ పవర్లతో వస్తుంది.

మహీంద్రా ఈ ఇంజన్‌లను కొంచెం తక్కువగా ట్యూన్ చేసే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉండొచ్చు. పూర్తి స్థాయి 4X4 డ్రైవ్ సిస్టమ్ హయ్యర్ ట్రిమ్ లెవెల్స్‌లో అందుబాటులో ఉంటుందని అంచనా. మహీంద్రా స్కార్పియో-ఎన్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్ వంటి వాటితో పోటీపడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Business, Mahindra, New car, Scorpio

తదుపరి వార్తలు