హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra SUV Sales: సెప్టెంబర్‌లో మహీంద్రా రికార్డు సేల్స్..SUVల విభాగంలో టాప్ ప్లేస్

Mahindra SUV Sales: సెప్టెంబర్‌లో మహీంద్రా రికార్డు సేల్స్..SUVల విభాగంలో టాప్ ప్లేస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (M&M).. వాహనాల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (M&M).. వాహనాల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. సెప్టెంబర్‌లో మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకున్న ఈ సంస్థ.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) విభాగంలో 34,262 యూనిట్లను విక్రయించి, ఈ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సెగ్మెంట్‌లో కంపెనీ కేవలం 12,863 యూనిట్లనే సేల్ చేయగా, ఈసారి అమ్మకాలు రెండింతలు పెరగడం విశేషం..

2021 సెప్టెంబర్‌లో మహీంద్రా లిమిటెడ్ మొత్తం 28,112 యూనిట్లను అమ్మగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమ్మకాలు భారీగా పెరిగాయి. గత నెలలో కంపెనీ మొత్తం 64,486 యూనిట్లను అమ్మగలిగింది. వీటిలో ప్యాసింజర్ వెహికల్స్ 34,508 యూనిట్లు, కమర్షియల్ వెహికల్స్ 27,440 యూనిట్లు, ఎగుమతులు 2,538 యూనిట్లు ఉన్నట్లు కంపెనీ సోమవారం తెలిపింది.

మార్కెట్‌లో మంచి డిమాండ్

తమ సంస్థ రికార్డు సేల్స్ సాధించిన సందర్భంగా PTIతో మాట్లాడారు మహీంద్రా & మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ నక్రా. సెప్టెంబర్ మొత్తం అమ్మకాలు భారీగా పెరిగాయని, SUV డిస్పాచ్‌ల పరంగా కంపెనీ రికార్డు సృష్టించిందని చెప్పారు. ‘కోవిడ్ టైమ్‌లో ప్యాసింజర్ వెహికల్స్ ఇండస్ట్రీ క్షీణించినప్పటికీ, SUVలపై పెద్దగా ప్రభావం పడలేదు. గత సంవత్సరం కూడా ఈ విభాగంలో గ్రోత్ కనిపించింది. ఈ సంవత్సరం దాదాపు 40 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ప్యాసింజర్ వెహికల్ ఇండస్ట్రీలో ఎస్‌యూవీలు బెస్డ్ డిమాండ్ ఉన్న, అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌గా కొనసాగుతున్నాయి’ అని నక్రా పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవ్వడం, మార్కెట్ ట్రెండ్స్ వంటి ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, మొత్తం డిమాండ్ బలంగానే ఉంటుందని నక్రా చెప్పారు.

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ దీపావళి సర్‌ప్రైజ్‌..రూ.80 వేలకే కొత్త స్కూటర్‌!

కలిసొచ్చిన సెంటిమెంట్

స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ వంటి మోడళ్లకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. కంపెనీ సప్లై చేయగల సామర్థ్యం కంటే వీటికి ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయి. పండుగకు ముందు కొత్త వెహికల్స్ కొనే సెంటిమెంట్‌కు మహీంద్రా మోడళ్ల సక్సెస్ టాక్ తోడవ్వడంతో గత నెలలో కంపెనీ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడళ్లతో పాటు పాత వేరియంట్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడిందని నక్రా తెలిపారు. సేల్స్‌కు బెస్ట్ సీజన్ కావడంతో, మార్కెట్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, SUV అమ్మకాలు భారీగా పెరిగాయని వెల్లడించారు. కంపెనీ నుంచి వచ్చిన స్కార్పియో-ఎన్, ఎక్స్‌యువీ 700, థార్, బొలెరో నియో, స్కార్పియో క్లాసిక్‌లకు మార్కెట్‌ నుంచి బెస్ట్ రెస్పాన్స్ లభించిందని చెప్పారు. తమ కంపెనీకి 2.6 లక్షల ఓపెన్ బుకింగ్‌లతో కూడిన ఆర్డర్ బుక్ ఉందని, ఇది కూడా తమ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అయిందని వివరించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Mahindra and mahindra, SUV

ఉత్తమ కథలు