Mahindra Car Offers: పండుగ ఆఫర్లను పొడిగించిన మహీంద్రా…ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు...

దసరా, దీపావళి సందర్భంగా అమ్మకాలను పెంచడానికి కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. మహీంద్రా కంపెనీ ఈ ఆఫర్లను నవంబర్ చివరి వరకు పొడిగించింది.

news18-telugu
Updated: November 17, 2020, 2:11 PM IST
Mahindra Car Offers: పండుగ ఆఫర్లను పొడిగించిన మహీంద్రా…ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఆటో మొబైల్ ఇండస్ట్రీపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పండుగ సీజన్ ఈ పరిశ్రమకు బాగా కలిసివచ్చింది. కొన్ని సంస్థలు రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. దసరా, దీపావళి సందర్భంగా అమ్మకాలను పెంచడానికి కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. మహీంద్రా కంపెనీ ఈ ఆఫర్లను నవంబర్ చివరి వరకు పొడిగించింది. వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా కార్ల కొనుగోలుపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఇతర ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. కానీ థార్, KUV100 NXT మోడళ్లపై ఎలాంటి డిస్కౌంట్ లేదని ఆ సంస్థ తెలిపింది. వివిధ మోడళ్లపై మహీంద్రా అందిస్తున్న ఆఫర్లు...

Mahindra Alturas G4

మహీంద్రా అల్టురాస్ జీ4 కారు కొనుగోలుపై రూ.2.20 లక్షల క్యాష్ డిస్కౌంట్‌, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. దీంతో పాటు వినియోగదారులు రూ.16,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 విలువైన ఉపకరణాలను (యాక్సెసరీలు) కూడా పొందవచ్చు.

Mahindra Scorpio

స్కార్పియో ఎస్5 మోడల్‌పై మహీంద్రా కంపెనీ రూ.20,000 క్యాష్‌ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.10,000 విలువైన ఉపకరణాలను అందిస్తోంది. స్కార్పియో సిరీస్‌లోని ఇతర వేరియంట్లపై రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తోపాటు రూ .5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందవచ్చు.

Mahindra XUV300

ఎక్స్‌యూవీ300 మోడల్‌లోని పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై వేర్వేరు తగ్గింపులను మహీంద్రా అందిస్తుంది. నవంబర్ 30 వరకు పెట్రోల్ వేరియంట్‌పై రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. డీజిల్ వేరియంట్‌ను రూ.10,000 క్యాష్‌ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.

Mahindra Bolero

బొలెరో మోడల్‌పై రూ.6,500 క్యాష్ డిస్కౌంట్‌ను మహీంద్రా అందిస్తోంది. దీంతో పాటు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Mahindra XUV500

ఈ మోడల్‌లో వచ్చిన W9, W11 వేరియంట్లపై రూ.13,000 క్యాష్ డిస్కౌంట్‌ను మహీంద్రా ప్రకటించింది. దీంతో పాటు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన ఉపకరణాలను వినియోగదారులు పొందవచ్చు. ఈ సిరీస్‌లో వచ్చిన W5, W7 వేరియంట్లపై రూ.12,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

Mahindra Marazzo

ఈ కారు కొనుగోలుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5,000 విలువైన ఉపకరణాలను కస్టమర్లు పొందవచ్చు. MPVలోని M2 వేరియంట్‌పై రూ.2,000 అదనపు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
Published by: Krishna Adithya
First published: November 17, 2020, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading