దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ రంగంలోకి అనేక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు అడుగుపెడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌తో మహీంద్రా గ్రూప్‌తో చేతులు కలిపింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ రంగంలోకి అనేక ప్రముఖ ఆటోమొబైల్(Auto mobile) కంపెనీలతో పాటు స్టార్టప్‌లు(Startups) అడుగుపెడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌తో మహీంద్రా గ్రూప్‌తో(Mahindra Group) చేతులు కలిపింది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తీర్చడానికి మహీంద్రా గ్రూప్‌కు చెందిన మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) పితంపూర్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మహీంద్రా గ్రూప్ హీరో ఎలక్ట్రిక్- ఆప్టిమా & ఎన్వైఎక్స్ మోడళ్ల తయారీని ప్రారంభించింది. ఈ ఒప్పందం ద్వారా మహీంద్రా గ్రూప్ ప్రతి ఏటా 10 లక్షల హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తద్వారా దేశంలోని ఈవీ వెహికిల్ డిమాండ్‌ను తీర్చనుంది. ఈ భాగస్వామ్యంపై హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ మాట్లాడుతూ, “దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో హీరో ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది. ఎలక్ట్రిక్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడానికి మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదర్చుకున్నాం. మా భాగస్వామ్యంతో త్వరలోనే ఎలక్ట్రిక్ త్రీ, ఫోర్-వీలర్స్ కూడా మార్కెట్లోకి రానున్నాయి. భారత్‌లోని రెండు స్వదేశీ టాప్ ఆటోమొబైల్ కంపెనీల కలయిక ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్‌ను తీర్చగలదని ఆశిస్తున్నాం.
మహీంద్రా సంస్థకు దేశంలో అతి పెద్ద సరఫరా వ్యవస్థ ఉంది. దీన్ని ఉపయోగించుకొని దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు, పట్టణాల్లో సైతం హీరో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తాం. మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల రెండు కంపెనీలు పరస్పరం సహకరించుకుంటూ భారత్‌లో ఈవీ మార్కెట్‌ను విస్తరిస్తాం. రాబోయే రోజుల్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తాం. సమీప భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.” అని చెప్పారు.
భారత ఈవీ మార్కెట్ విస్తరణే లక్ష్యంగా..
ఈ భాగస్వామ్యంపై మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ఆటో & ఫార్మ్ సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, ‘‘ప్యూగోట్ మోటోసైకిల్స్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా యూరప్‌లోని ఈవీ మొబిలిటీ స్పేస్‌లో గొప్పగా రాణిస్తున్నాయి. మా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను మరింతగా విస్తరించనున్నాం.
పితంపూర్‌లోని వాహన తయారీ కేంద్రం ద్వారా ప్యుగోట్ను సరఫరా చేయనున్నాం. ప్యుగోట్ మోటార్‌సైకిల్స్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేసేందుకు మా ఉమ్మడి భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీ ద్వారా ఈ వాహనాలను అభివృద్ది చేయనున్నాం. హీరో సంస్థతో మా భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని మరింత పెంచడమే కాకుండా ఈవీ మార్కెట్లో పైచేయి సాధించేందుకు ఉపయోగపడుతుంది.” అని తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.