హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!

Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!

 ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ ను లాంఛ్ చేయనున్న మహీంద్రా.. ఫ్యూచర్ ప్లాన్ చూస్తే వావ్ అంటారు !

ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ ను లాంఛ్ చేయనున్న మహీంద్రా.. ఫ్యూచర్ ప్లాన్ చూస్తే వావ్ అంటారు !

ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) మార్కెట్‌లో కోల్పోయిన స్పేస్‌ను తిరిగి పొందేందుకు ప్రణాళికలు వేస్తోంది మహీంద్రా(Mahindra) ఎలక్ట్రిక్ కంపెనీ. ఈ సంస్థ ఫ్యూచర్ ప్లాన్స్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో అన్ని సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ (Launch) చేయాలని చూస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) మార్కెట్‌లో కోల్పోయిన స్పేస్‌ను తిరిగి పొందేందుకు ప్రణాళికలు వేస్తోంది మహీంద్రా(Mahindra) ఎలక్ట్రిక్ కంపెనీ. ఈ సంస్థ ఫ్యూచర్ ప్లాన్స్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో అన్ని సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేయాలని చూస్తోంది.

ఇండియన్ మార్కెట్ (Market) కోసం మహీంద్రా ఎలక్ట్రిక్ 2016- 2019 మధ్యలోనే మహీంద్రా e2o అనే ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేసింది. 2001లో చేతన్ మైనీ.. రెవా (Reva) అనే రెండు సీట్ల ఎలక్ట్రిక్ కారు (Electric Car) ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని ప్రారంభించారు చైతన్ మైనీ. 2001లో ఆయన కంపెనీ రెవా అనే రెండు సీట్ల ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. అయితే 2010లో M&M రెవా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పటికే ఆ సంస్థ దాదాపు 5,000 కార్లను విక్రయించింది. అయితే ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ జర్నీ ‘బిజ్లీ’ (Bijlee) అనే ఆటోతో ప్రారంభమైంది. దీన్ని మహీంద్రా & మహీంద్రా 1999లోనే తయారు చేసింది. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ ఈ వెహికల్ EV జర్నీలో M&Mకి సహాయం చేయలేదు.

2025 నాటికి భారతీయ రోడ్లపైకి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో M&M పనిచేస్తోంది. ఇండియన్ EV సెక్టార్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఇప్పటికే ఇండియన్ బిజినెస్ కోసం దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడి పెట్టగా, కొత్త R&D సెంటర్ కోసం మరో రూ.500 కోట్లు అదనంగా కేటాయించింది. M&M కంపెనీ ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ వాహనాల రేస్ కార్ సర్క్యూట్ అయిన ‘ఫార్ములా E’కి ఫౌండింగ్ మెంబర్‌గా ఉంది. యూరోప్‌లో బాటిస్టా అనే సూపర్-ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా కంపెనీ ఆవిష్కరించింది.

ఇదీ చదవండి: Jio Games Watch: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ .. జియో కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌.. చూస్తే వదలరు


 భారతదేశంలో EV సెక్టార్‌లో వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. అయితే ఇది గత రెండు సంవత్సరాల్లో వేగాన్ని పుంజుకుంది. M&M 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14,000+ EVలను విక్రయించింది. 2018-19 సేల్స్ కంటే ఇది 40 శాతం పెరిగిందని మహీంద్రా ఎలక్ట్రిక్ MD & CEO మహేష్ బాబు తెలిపారు. M&M 2010లో రెవా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొత్త కంపెనీ ‘మహీంద్రా రెవా’ నుంచి మొదటి కారు మహీంద్రా e2o లాంచ్ అయింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరగడానికి చాలా సమయం పట్టింది. దీంతో కంపెనీల ఆదాయాలు నెమ్మదిగా పెరిగాయి. కానీ ప్రస్తుతం ఈవీలకు ప్రభుత్వం కూడా మద్దతిస్తుండటంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్లు కొత్త ప్రొడక్ట్స్‌తో మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

EVలు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు దేశ చమురు దిగుమతి బిల్లును తగ్గిస్తూ దేశానికి సాయం చేస్తాయి. M&M మొత్తం ఎలక్ట్రిక్ ఎకో సిస్టమ్‌పై దృష్టి సారించింది. ఇప్పుడు EVలలో అతిపెద్ద భారతీయ పెట్టుబడిదారుగా మారింది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ 48 వోల్ట్‌లు, 650 వోల్ట్‌ల మధ్య బ్యాటరీ పరిధిలోని వాహనాలను అభివృద్ధి చేయడంపై పని చేస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను అందించేందుకు సిద్ధంగా ఉంది. TATA, MG, హోండా, సుజుకి (Suzuki) ఇప్పటికే ఎక్కువ దూరం ప్రయాణించగల క్విక్ ఛార్జింగ్ వెహికల్స్‌ను అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీంతో ఈ రంగంలో టాప్ ప్లేస్ కోసం మహీంద్రా మరిన్ని ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

First published:

Tags: Anand mahindra, Automobiles, Electric cars, Mahindra

ఉత్తమ కథలు