హోమ్ /వార్తలు /బిజినెస్ /

Formula E Car: అతి పెద్ద ఈవెంట్‌కు వేదిక కానున్న హైదరాబాద్.. ప్రత్యేక ఆకర్షణగా మహీంద్రా ఫార్ములా E కారు..

Formula E Car: అతి పెద్ద ఈవెంట్‌కు వేదిక కానున్న హైదరాబాద్.. ప్రత్యేక ఆకర్షణగా మహీంద్రా ఫార్ములా E కారు..

Mahindra Formula E Car ( Photo : Twitter)

Mahindra Formula E Car ( Photo : Twitter)

Formula E Car: 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో FIA ఫార్ములా E రేస్‌ నిర్వహించనున్నారు. అయితే మహీంద్రా కంపెనీ ముందు నుంచి ఫార్ములా E లో భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా హైదరాబాద్‌లో మహీంద్రా ఫార్ములా E కారు(Mahindra Formula E Car)ను ఆవిష్కరించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వివిధ రంగాల్లో అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన హైదరాబాద్ (Hyderabad) నగరం.. మరో ఘనతకు చేరువైంది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీపై అవగాహన పెంచేందుకు రూపొందించిన ప్రపంచలోనే అతి పెద్ద ఈవెంట్‌కు నగరం వేదిక కానుంది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో FIA ఫార్ములా E రేస్‌ (Formula E Race) నిర్వహించనున్నారు. దీంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే మహీంద్రా కంపెనీ ముందు నుంచి ఫార్ములా E లో భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా హైదరాబాద్‌లో మహీంద్రా ఫార్ములా E కారు(Mahindra Formula E Car)ను ఆవిష్కరించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ అరవింద్ కుమార్ మహీంద్రా ఫార్ములా E కారును తాజాగా ఆవిష్కరించారు. దుర్గం చెరువు కేబుల్-స్టేడ్ బ్రిడ్జి వద్ద దీన్ని ఆవిష్కరించిన తర్వాత, దీన్ని ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. రానున్న రోజుల్లో ఈ కారును నగరంలోని అనేక ఇతర ప్రదేశాలలో, భారతదేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కూడా ప్రదర్శించనున్నారు.

భారతదేశంలో మొట్టమొదటి ఫార్ములా E రేస్‌పై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఈ కారును ప్రదర్శిస్తున్నారు. 2023లో ఫార్ములా E ప్రిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంపిక చేసిన ప్రపంచంలోని 12 నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటి. 2.37 కి.మీల ట్రాక్ హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి, తెలంగాణ సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్ మీదుగా వెళుతుంది.

* గరిష్ట వేగం 280 kmph

నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, ఫార్ములా E Gen 2 కార్లు ఫార్ములా 1 కార్ల మాదిరిగానే ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో నడుస్తాయి. 250kW బ్యాటరీతో నడిచే ఈ కారు మూడు సెకన్లలోపు 0 నుంచి 62 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 280 kmph. పూర్తి వేగంతో కారు పరుగులు తీస్తే శబ్దం కేవలం 80 డెసిబుల్స్‌కు చేరుకుంటుంది. ఈ కార్లు హైబ్రిడ్ టైర్లను ఉపయోగిస్తాయి.

ఇది కూడా చదవండి :మార్కెట్‌లోకి సరికొత్త టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

* అత్యంత వేగంగా అభివృద్ధి

ఫార్ములా E ప్రిక్స్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఫార్ములా E అనేది ఎలక్ట్రిక్-పవర్డ్ సింగిల్-సీటర్ ఛాంపియన్‌షిప్. ఏడో సంవత్సరం (2020-21 సీజన్)లో FIA ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్ హోదాను పొందింది.

ఫార్ములా E ఛాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్ (2022-23) క్యాలెండర్‌ను FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో రేస్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా E అధికారులు లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్‌ఓఐ)పై సంతకం చేశారు. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఫార్ములా వన్ రేసును జరిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Hyderabad news, Mahindra, Telangana News

ఉత్తమ కథలు