హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Offers: ఈ నెలలో మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..రూ. 2.63 లక్షల వరకు రాయితీలు

Mahindra Offers: ఈ నెలలో మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్లు..రూ. 2.63 లక్షల వరకు రాయితీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా SUVలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్, అదనపు రాయితీలను సంస్థ ప్రకటించింది. వినియోగదారులు గరిష్ఠంగా రూ.2.63 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది.

భారత మార్కెట్లోకి అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న కంపెనీల్లో Mahindra  ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ సంస్థ సెప్టెంబర్‌లో అమ్మకానికి ఉంచిన కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. దీంతోపాటు పలు క్యాష్ ఆఫర్లను కూడా వినియోగదారుల ముందుంచింది. Mahindra  SUVలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్, అదనపు రాయితీలను సంస్థ ప్రకటించింది. వినియోగదారులు గరిష్ఠంగా రూ.2.63 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది. ఈ నెలలో ఏయే కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

Mahindra  Bolero ..

Mahindra  Bolero  వాహనంపై రూ.21,000 వరకు రాయితీని ప్రకటించింది. క్యాష్ ఆఫర్ రూ.3,500 వరకు, కార్పొరేట్ ఆఫర్ రూ.11,000 వరకు, ఇతర అదనపు డిస్కౌంట్లు 6,500 వరకు ఉన్నాయి.

ఇది చదవండి...New Cars: దసరాకు కొత్త కారుకొంటున్నారా...రూ.7 లక్షల లోపున్న కార్లు ఇవే...

Mahindra  Scorpio

ఈ ఎస్‌యూవీపై 23 వేల రూపాయల వరకు రాయితీని Mahindra  ప్రకటించింది. ఎస్3 వేరియంట్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.5 వేల వరకు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ రూ.15 వేల వరకు ఉంది. ఎస్5 వేరియంట్ పై కార్పొరేట్ ఆఫర్ రూ.10 వేలు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ రూ.13,000 ప్రకటించింది. ఎస్5, ఎస్9, ఎస్11 వేరియంట్లపై రూ.7 వేల వరకు రాయితీనిచ్చింది.

Mahindra  KUV 100 NXT..

ఈ కారుపై కార్పొరేట్ ఆఫర్ రూ.3 వేల వరకు ఇచ్చింది. కే2 వేరియంట్ పై రూ.16,000, కే4 వేరియంట్ పై రూ.23,000, కే8 వేరియంట్ పై రూ.38,000 వరకు క్యాష్ ఆఫర్లను ఇచ్చింది.

Mahindra  XUV 300..

ఈ వాహనంపై రూ.15 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్, రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.11,500 వరకు కార్పొరేట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఇది చదవిండి.. Tata Sumo: టాటా సుమో మళ్లీ వచ్చేస్తోంది...ఈ సారి డిజైన్, ధర వివరాలివే..

Mahindra  XUV 500..

ఈ వాహనంపై Mahindra  సంస్థ భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. అన్ని ఆఫర్లు కలిపి దాదాపు రూ.2.63 లక్షల వరకు రాయితీనిచ్చింది. డబ్ల్యూ11(ఓ) వేరియంట్ పై రూ.1.79 లక్షల వరకు క్యాష్ ఆఫర్, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.13,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ.20 వేల వరకు విలువ కలిగిన ఫ్రీ యాక్సెసిరీస్‌ ఆఫర్‌ను అందిస్తోంది.

డబ్ల్యూ9, డబ్ల్యూ7 వేరియంట్లపై రూ.1.28 లక్షల క్యాష్ ఆఫర్, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.13,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ.20 వేల విలువ కలిగిన ఫ్రీ యాక్సెసిరీస్‌ను ఇచ్చింది.

ఈ ఆఫర్లు సెప్టెంబరు 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. లొకేషన్, వేరియంట్ల ప్రకారం ఈ రాయితీల్లో తేడాలు ఉండవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న Mahindra  డీలర్ల వద్ద ఈ ఆఫర్లు, కార్లకు సంబంధించిన మరింత సమాచారం పొందవచ్చు.

Published by:Krishna Adithya
First published:

Tags: Cars, Mahindra and mahindra