Scorpio | పండుగ సీజన్ నడుస్తోంది. దీపావళి (Diwali) వస్తోంది. ఫెస్టివ్ సీజన్లో కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయ తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? కొన్ని కార్లు (Cars) కొనాలంటే రెండేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేంటి కారు కొనాలంటే (Car Buying) రెండేళ్లు ఆగాలా? అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ విషయం తెలుసుకుంటే మీరు ఔరా అని అనుకుంటారు.
భారతదేశంలో ఆటోమొబైల్ రంగం చాలా పుంజుకుంటోంది. చాలా కంపెనీలు ఇటీవల అత్యధిక అమ్మకాలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో మహీంద్రా కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా కార్ల డిమాండ్ ఏ మేర ఉందంటే.. ఏకంగా 24 నెలల వెయిటింగ్ పీరియర్ నడుస్తోంది.
రూ.6 వేలు పతనమైన బంగారం, వెండి ధరలు.. జస్ట్ 10 రోజుల్లోనే భారీ తగ్గుదల!
స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి.
ఎస్బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. ఈరోజు నుంచి..
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా స్కార్పియో ఎన్ తన ప్రీమియం డిజైన్, అదిరిపోయే లుక్‌తో మనందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా కొనుగోలుదారులకు అనుగుణంగా ఉండేలా వివిధ పవర్ ట్రైన్ ఆప్షన్లను కలిగి ఉంది.
ఈ కారుకు సంబంధించి జెడ్ 8, జెడ్ 6 వేరియంట్లకు బలమైన డిమాండ్ ఉంది. వీటికి వెయిటింగ్ లిస్ట్ 24 నెలలు ఉంది. మహీంద్రా థార్ మోడల్ విషయానికి వస్తే.. కొత్త మహీంద్రా థార్ అనేది దేశంలో అత్యంత చౌకైన 4X4 ఎస్‌యూవీల్లో ఒకటి మాత్రమే కాదు, బలమైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఫోర్స్ గూర్ఖా వంటి ప్రత్యర్థులకు బలమైన పోటీని ఇస్తుంది.
మహీంద్రా థార్ ప్రస్తుతం డీజిల్ . పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా 6 నెలల నుంచి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బొలెరో అనేది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌వీయూల్లో ఒకటి. ఇంకా బ్రాండ్ సేల్స్ వాల్యూమ్ చార్ట్ పై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ప్రస్తుతం దేశంలో బొలెరో , బొలెరో నియో కోసం వేచి ఉండే కాలం ౩ నెలల వరకు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, CAR, Mahindra, Mahindra and mahindra, Scorpio