హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cars Price Hike: కొత్తగా కార్లు కొనాలనుకుంటున్న వారికి షాక్.. ఆ కంపెనీ కార్ల ధర పెంపు

Cars Price Hike: కొత్తగా కార్లు కొనాలనుకుంటున్న వారికి షాక్.. ఆ కంపెనీ కార్ల ధర పెంపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా (Mahindra) కూడా కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని రేంజ్ మోడల్ కార్ల రేట్లను 2.5 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

  ఇటీవల కార్ల ధరలను (Cars Price) ఆయా కంపెనీలు పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా (Mahindra & Mahindra Ltd) కూడా కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని రేంజ్ మోడల్ కార్ల రేట్లను 2.5 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. రేట్ల పెంపు తక్షణమే ఆచరణలోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు కారణంగా కార్ల మోడల్‌ను బట్టి ఎక్స్‌షోరూం రేట్లు రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు పెరగనున్నాయని కంపెనీ వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కార్ల తయారీలో కీలకమైన స్టీల్, అల్యూమినియం, పల్లాడియంతోపాటు ఇతర ముడిపదార్థాల ధరలు పెరుగుతుండడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ వెల్లడించింది. మహీంద్రా XUV700 మరియు థార్ వంటి మోడళ్లకు అధిక డిమాండ్ ఉంది, అయితే ఈ రెండింటిలో కొన్ని వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ నెలల తరబడి కొనసాగుతోంది. ఇది కాకుండా, కంపెనీ యొక్క బొలెరో నియో, XUV300 మరియు స్కార్పియో వంటి మోడల్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

  ఇప్పటికే అనేక కార్ల కంపెనీలు తమ వెహికిల్స్‌పై భారీగా ధరల పెంపును ప్రకటించాయి. జనవరిలోనే ధరల పెంపును చేపట్టిన ఆటో కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో మరో సారి ధరల పెంపును చేపట్టాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య సంక్షోభం, చైనాలో మళ్లీ కరోనా భయాలు వంటి కారణాలతో ఆటో కంపెనీలకు కావాల్సిన పార్ట్‌లు, మెటీరియల్స్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  Cars Under Rs.10 Lakhs: ఇండియాలో రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ కార్లు ఇవే..!అవేంటో తెలుసుకోండి..

  ఇప్పటికే కియా, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఎంజీ మోటార్, హ్యుండాయ్, టయోటా, బీఎండబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ తదితర సంస్థలు తమ వాహనాలపై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డిమాండ్ పెరగడం, సప్లయిలో అంతరాయం కారణంగా అనేక కంపెనీలు తమ వాహనాలను డెలివరీ చేయడానికి నెలల పాటు సమయం తీసుకుంటున్నాయి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Cars, Mahindra and mahindra, Tata

  ఉత్తమ కథలు