ప్రభుత్వ ఉద్యోగులకు మహీంద్రా ప్రత్యేక ఆఫర్లు.. రూ. 11,500 తగ్గింపుతో పాటు..

ప్రతీకాత్మక చిత్రం

మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆకట్టుకునే ఫైనాన్స్‌ ఆప్షన్లను ప్రకటించింది. 19.4 బిలియన్ డాలర్ల విలువ ఉన్న మహీంద్రా సంస్థ, తమ ఉత్పత్తులపై ఈ వినూత్న ఆఫర్లను ప్రవేశపెట్టింది.

  • Share this:
మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆకట్టుకునే ఫైనాన్స్‌ ఆప్షన్లను ప్రకటించింది. 19.4 బిలియన్ డాలర్ల విలువ ఉన్న మహీంద్రా సంస్థ, తమ ఉత్పత్తులపై ఈ వినూత్న ఆఫర్లను ప్రవేశపెట్టింది. సంస్థ నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలకు సంబంధించిన యాక్సెసరీలు, వర్క్‌షాప్ సంబంధిత చెల్లింపులు, పొడిగించిన వారంటీపై ఆఫర్లను తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్ల కోసం మహీంద్రా ప్రత్యేకంగా “సర్కార్ 2.0” పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, పీఎస్‌యూ ఉద్యోగులు రూ.11,500 వరకు అదనపు తగ్గింపులు పొందవచ్చు. జీరో ప్రాసెసింగ్ ఫీజు, సున్నా ఫోర్ క్లోజర్ ఛార్జీలు, 7.25 శాతం నుంచి ప్రారంభమయ్యే అతి తక్కువ వడ్డీ రేటు, వివిధ ఫైనాన్స్ పార్ట్నర్‌లతో ఎనిమిది సంవత్సరాల వరకు గడువు ఉండే ఫైనాన్స్‌ ఆప్షన్లు, వ్యక్తిగత UVల కొనుగోలుపై లక్షకు రూ.799తో ప్రారంభమయ్యే EMI... వంటి ఆకట్టుకునే ఆఫర్లను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.

తగ్గిన పండుగ అమ్మకాలు
పండుగ సీజన్‌ సందర్భంగా ఇతర సంస్థల వాహనాల అమ్మకాలు పెరిగాయి. కానీ ఈ అక్టోబర్‌లో సంస్థకు చెందిన మొత్తం వాహనాల అమ్మకాలు 14.5 శాతం తగ్గినట్లు మహింద్రా సంస్థ ప్రకటించింది. ఆటోమొబైల్ రంగంలో వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, గత నెలలో కేవలం 44,359 వాహనాలనే ఆ సంస్థ అమ్మగలిగింది. గత ఏడాది అక్టోబర్‌లో మహింద్రా వాహనాలను అమ్మింది.

ఆ అమ్మకాల్లో వృద్ధి
యుటిలిటీ వెహికిల్స్, కార్లు, వ్యాన్లు వంటి ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో అమ్మకాలు కొంతమేరకు పెరిగాయి. గత నెలలో ఈ విభాగంలో మొత్తం 18,622 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఒక శాతం వృద్ధి రేటుతో ఈ అమ్మకాలు పెరిగినట్లు M&M ఒక ప్రకటనలో తెలిపింది. యుటిలిటీ వేకిల్స్ విభాగంలో అమ్మకాలు మూడు శాతం పెరిగాయి. 2019 అక్టోబర్‌లో యుటిలిటీ వేకిల్స్ విభాగంలో మొత్తం 17,785 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఇది 18,317 యూనిట్లకు పెరిగింది.
Published by:Nikhil Kumar S
First published: