Mahindra: వాహనం ఇప్పుడు కొని డబ్బులు తర్వాత చెల్లించండి... మహీంద్రా బంపరాఫర్

Mahindra: వాహనం ఇప్పుడు కొని డబ్బులు తర్వాత చెల్లించండి... మహీంద్రా బంపరాఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Mahindra | వాహనం ఇప్పుడు తీసుకొని 90 రోజుల తర్వాత డబ్బులు చెల్లించండి అంటూ మహీంద్రా బంపరాఫర్ ప్రకటించింది.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీని కారణంగా ఆటో పరిశ్రమ తీవ్ర నష్టాల్లోకి జారుకుంది. అందుకే, నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టేందుకు వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా వినూత్న ఆఫర్​ ప్రకటించింది. కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని ఇప్పుడు కొనుగోలు చేసి.. మూడు నెలల తర్వాత ఈఎంఐ కట్టుకోవచ్చని తెలిపింది. అంటే కొనుగోలు సమయంలో ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని.. మూడు నెలల తర్వాతే మొదటి ఈఎంఐ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. వాణిజ్య వాహనాలకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

మహీంద్రా తన వినియోగదారులకు కాంటాక్ట్​ లెస్​ సేవలు అందించేందుకు గాను ‘ఓన్​ ఆన్​లైన్’ అనే ప్లాట్​ఫామ్​ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా ఆన్​లైన్​ రుణాలు సమకూరుస్తోంది. ఈ ప్లాట్​ఫామ్​ నుంచి వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 విలువైన యాక్సెసరీలు, రుణ మంజూరులో రూ.2,000 లబ్ధి చేకూరనుంది. కస్టమర్లు యాక్సెసరీస్​ ఖర్చు, ఎక్స్​టెండ్​ వారెంటీ చెల్లింపులు, వర్క్​షాప్​ చెల్లింపులను కూడా ఈఎంఐలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాక, రూ.3,000 వరకు క్యాష్​బ్యాక్​ కూడా ఆఫర్ చేస్తోంది. ఇక, 7.25 శాతం వడ్డీ రేటుకే వాహన రుణాలను అందిస్తోంది. 100 శాతం ఆన్​ రోడ్​ ఫండింగ్​ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తే ఎటువంటి అదనపు ఛార్జి వసూలు చేయమని తెలిపింది. యాక్సెసరీస్​, ఎక్స్​టెండెడ్​ వారెంటీలపై కూడా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది.

EPFO Insurance: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.7,00,000 వరకు బీమా

IRCTC Work From Hotel: హిమాలయాలకు దగ్గరగా ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ

56 శాతం పడిపోయిన అమ్మకాలు


కరోనా కారణంగా.. అన్ని ఇతర వాహన సంస్థల మాదిరిగానే మహీంద్రా కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దేశీయ మార్కెట్లో మే నెలలో కేవలం 8,004 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇక, ఏప్రిల్‌ నెలలో 18,285 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక్క నెలలోనే 56% అమ్మకాలు తగ్గాయని ఈ గణాంకాలను బట్టి చెప్పవచ్చు. అయితే, దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని మహీంద్రా భావిస్తోంది.

Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

ECLGS: ఎమర్జెన్సీ క్రెడిట్ స్కీమ్ కింద లోన్... ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ విభాగానికి చెందిన వీజయ్ నక్రా మాట్లాడుతూ "కరోనా కారణంగా గత నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ.. మా మొత్తం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో బలమైన వృద్ధిని చూస్తున్నాము. వెయింట్​ పీరియడ్​ ఎక్కువగా ఉన్నప్పటికీ మహీంద్రా థార్ బలమైన అమ్మకాలను ప్రదర్శిస్తోంది. XUV300 కూడా మంచి అమ్మకాలు సాధిస్తోంది. భవిష్యత్తులు అమ్మకాల వృద్ధి మరింతగా ఉంటుందని ఆశిస్తున్నాం." అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published: