• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • MAHINDRA ANNOUNCED EXCHANGE OFFER CORPORATE OFFER ON VARIOUS MODELS KNOW ALL DETAILS SS GH

Mahindra car offers: ఈ మహీంద్రా కార్లపై ఎక్స్‌ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్

Mahindra car offers: ఈ మహీంద్రా కార్లపై ఎక్స్‌ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Mahindra car offers | కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? మహీంద్రా కార్లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్, కార్పొరేట్ ఆఫర్స్ ప్రకటించింది కంపెనీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
భారత ఆటోమొబైల్ సంస్థలు జూన్, జులై నెలల్లో వాహనాలపై భారీ ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం అనుసరిస్తూ చాలా ఆటోమేకర్లు సరికొత్త ఆఫర్లను వాహన ప్రియుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మహీంద్రా సంస్థ తన కార్లపై విభిన్న రకాల ఆఫర్లను ప్రవేశపెట్టింది. మహీంద్రా థార్ మినహా మిగిలిన కార్లపై విభిన్న డిస్కౌంట్లు, క్యాష్ ఆఫర్లను ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో పాటు కార్పోరేట్ ఆఫర్ లాంటి తదితర ఆఫర్లను ఇచ్చింది. మరి మహీంద్రా సంస్థ ప్రకటించిన రాయితీలేంటో ఇప్పుడు చూద్దాం.

మహీంద్రా బొలేరో


ఈ మోడల్ పై రూ.15,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఇచ్చింది. దీంతో పాటు రూ.3,000 వరకు కార్పోరేట్ ఆఫర్ కూడా ప్రకటించింది.

IRCTC Work from Hotel: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి బోర్ కొట్టిందా? ఈ ప్యాకేజీ మీకోసమే

SBI Mobile Number Change: ఎస్‌బీఐ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ ఇలా మార్చండి

మహీంద్రా స్కార్పియో


ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.15,000
కార్పోరేట్ ఆఫర్- రూ.4,500
ఉచిత యాక్సెసరీస్- రూ.17,042

మహీంద్రా మారాజో


క్యాష్ బ్యాక్ ఆఫర్- రూ.20,000
ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.15,000
కార్పోరేట్ ఆఫర్- రూ.5,200

మహీంద్రా ఎక్స్ యూవీ300


క్యాష్ బ్యాక్ ఆఫర్- రూ.5,000
ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.25,000
కార్పోరేట్ ఆఫర్- రూ.4,000
ఉచిత యాక్సెసరీస్- రూ.10,000

Best Smartphones Under Rs 20,000: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ


క్యాష్ ఆఫర్- రూ.38,055
ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.20,000
కార్పోరేట్ ఆఫర్- రూ.3,000

మహీంద్రా ఎక్స్ యూవీ 500


క్యాష్ ఆఫర్- రూ.51,600
ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.50,000
కార్పోరేట్ ఆఫర్- రూ.6,500
ఉచిత యాక్సెసరీస్- రూ.15,000

మహీంద్రా అల్తూరస్ జీ4


క్యాష్ ఆఫర్- రూ.2.2 లక్షల వరకు
ఎక్స్ఛేంజ్ ఆఫర్- రూ.50,000
కార్పోరేట్ ఆఫర్- రూ.11,500
ఉచిత యాక్సెసరీస్ విలువ- రూ.20,000

ఈ ఆఫర్లు కేవలం జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దేశంలో వివిధ ప్రదేశాలు, వేరియంట్ల ఆధారంగా ఈ ఆఫర్లలో వ్యత్యాసముండే అవకాశముంది. మరిన్ని వివరాలు కోసం మహీంద్ర డీలర్‌షిప్‌లను సంప్రదించాలి. కార్లు, వేరియంట్ల ఆఫర్ల కోసం సమీపంలోని డీలర్ల వద్దకైనా వెళ్లవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: