హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Electric XUV400: 456 కిమీల రేంజ్‌.. అదిరే ఫీచర్లతో మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ XUV400 ఆవిష్కరణ..

Mahindra Electric XUV400: 456 కిమీల రేంజ్‌.. అదిరే ఫీచర్లతో మహీంద్రా ఆల్-ఎలక్ట్రిక్ XUV400 ఆవిష్కరణ..

(Photo : Mahindra)

(Photo : Mahindra)

Mahindra Electric XUV400: మహీంద్రా & మహీంద్రా.. త్వరలో ఆల్ ఎలక్ట్రికల్ మహీంద్రా XUV400ను తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈ వెహికల్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం భారత్‌ (India)తో పాటు ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ (Green Energy)కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంధనం వాడకం తగ్గించి పర్యావరణానికి నష్టం కలిగించని క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (Electric Vehicles)కు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఈవీల తయారీపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన మహీంద్రా & మహీంద్రా.. త్వరలో ఆల్ ఎలక్ట్రికల్ మహీంద్రా XUV400ను తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈ వెహికల్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది.మహీంద్రా గ్రూప్ 2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు M&M లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా. వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆల్-ఎలక్ట్రిక్ మహీంద్రా XUV400ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. బెస్ట్ ఇంటీరియర్‌తో బోల్డ్ సైజ్‌తో వస్తున్న ఈ SUV, కస్టమర్లకు బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని పేర్కొన్నారు.
* డిజైన్
ఆల్-ఎలక్ట్రిక్ XUV400.. 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన eXUV300 కాన్సెప్ట్ బేస్డ్ మోడల్‌గా కనిపిస్తోంది. కొత్త బ్రాంజ్ కలర్ 'ట్విన్ పీక్స్' లోగోతో రానున్న మొదటి మహీంద్రా ఎలక్ట్రిక్ మోడల్ ఇది. మహీంద్రా XUV400 ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. డైమండ్ కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ అల్లాయ్-వీల్స్‌తో వెహికల్‌ను డిజైన్ చేశారు. ఆల్-ఎలక్ట్రిక్ SUV 4200 mm పొడవు, 1821 mm వెడల్పు, 2600 mm వీల్‌బేస్, 378 లీటర్ల బూట్ కెపాసిటీతో వస్తుంది.


* స్టైలింగ్ ఎలా ఉంది?
బంపర్ స్టైలింగ్ స్పోర్టీ లుక్‌లో కనిపిస్తోంది. కంపెనీ ఎలక్ట్రికల్ సెగ్మెంట్‌కు గుర్తుగా XUV400లో కొత్తగా బ్రాంజ్ కలర్ థీమ్‌ను చేర్చారు. సైడ్ ప్రొఫైల్ చాలావరకు XUV300 మాదిరిగానే ఉంటుంది. గ్లాస్ హౌస్, క్యారెక్టర్ లైన్‌ వంటివి పాత మోడల్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అయితే వెహికల్ వెనుక భాగం కొత్త లైసెన్స్ ప్లేట్, ర్యాప్‌రౌండ్ టెయిల్-ల్యాంప్ క్లస్టర్, టెయిల్‌గేట్‌తో వస్తుంది. ఈ పార్ట్ మాత్రం XUV300 కంటే భిన్నమైన డిజైన్‌లో వస్తుంది.
* కనెక్టివిటీ ఫీచర్లు
మహీంద్రా XUV400 స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. బ్లూసెన్స్ ప్లస్ మొబైల్ యాప్‌తో 60+ క్లాస్ లీడింగ్ కనెక్టివిటీ ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.
* బ్యాటరీ కెపాసిటీ, రేంజ్
XUV400 వాహనం IP67 సర్టిఫైడ్ (వాటర్‌ప్రూఫ్ & డస్ట్‌ప్రూఫ్) 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 147.5 bhp టాప్ పవర్, 310 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 150 kmph గరిష్ట వేగంతో కేవలం 8.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు. సింగిల్ ఛార్జ్‌పై 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
7.2 kW/32A అవుట్‌లెట్‌తో బ్యాటరీని 0-100% ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. కానీ DC ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. అయితే ఒక స్టాండర్డ్ 3.3 kW/16A డొమెస్టిక్ సాకెట్‌తో SUVని ఫుల్ ఛార్జ్ చేయడానికి 13 గంటలు పడుతుంది.
ఇది కూడా చదవండి : EV: మరో సంచలనానికి టాటా మోటార్స్ రెడీ.. ఈసారి చౌక ధరకే ఎలక్ట్రిక్ కారు!


* లాంచింగ్ ఎప్పుడు?
XUV400 టెస్ట్ డ్రైవ్స్ డిసెంబరులో, 16 నగరాల్లో ప్రారంభమవుతాయి. అదే సమయంలో డెమో వెహికల్స్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటాయి. 2023 జనవరిలో కంపెనీ దీని ధరలను ప్రకటించనుంది. అనంతరం ముంబై, హైదరాబాద్ , ఢిల్లీ NCR, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, పూణె, అహ్మదాబాద్, గోవా , జైపూర్, సూరత్, నాగ్‌పూర్, త్రివేండ్రం, నాసిక్, చండీగఢ్, కొచ్చి వంటి 16 నగరాల్లో డెలివరీలను వెంటనే ప్రారంభించనుంది. ఇది ఇండియన్ మార్కెట్‌లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Electric Vehicles, Mahindra and mahindra

ఉత్తమ కథలు