హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Scorpio-N: మహీంద్రా స్కార్పియో-ఎన్‌ రిలీజ్ అప్పుడే.. ఫొటోలు రిలీజ్ చేసిన కంపెనీ!

Mahindra Scorpio-N: మహీంద్రా స్కార్పియో-ఎన్‌ రిలీజ్ అప్పుడే.. ఫొటోలు రిలీజ్ చేసిన కంపెనీ!

మహీంద్రా స్కార్పియో (Photo: Twitter)

మహీంద్రా స్కార్పియో (Photo: Twitter)

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన స్కార్పియో (Scorpio) ఎస్‌యూవీ న్యూ జనరేషన్ వెర్షన్ కోసం చాలా కాలంగా వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే వారి నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. ఎందుకంటే కంపెనీ న్యూ జనరేషన్ స్కార్పియో మోడల్ ఫొటోలను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) నుంచి విడుదలైన స్కార్పియో (Scorpio) ఎస్‌యూవీ చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎస్‌యూవీ (SUV) న్యూ జనరేషన్ వెర్షన్ కోసం చాలా కాలంగా వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే వారి నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. ఎందుకంటే కంపెనీ న్యూ జనరేషన్ స్కార్పియో మోడల్ ఫొటోలను (Model photos) విడుదల చేసింది. అంతేకాదు, ఈ కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీని 27 జూన్ 2022న ఇండియాలో విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇంకో నెలలో రిలీజ్ కానున్న ఈ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియో-ఎన్‌ (Mahindra Scorpio-N)గా వాహన ప్రియులను పలకరించనుంది. ఈ కొత్త పేరు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత జనరేషన్ కారును మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌గా విక్రయించనున్నారు.

చాలా ఏళ్లుగా స్కార్పియో డిజైన్‌ (Scorpio Design)లో స్టైలింగ్ మెయిన్ హైలెట్‌గా నిలుస్తోంది. అయితే కొత్తగా వస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్‌ ఎస్‌యూవీ డిజైన్ ఫీచర్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. స్వింగ్-అవుట్ టెయిల్‌గేట్‌ (Swing-out tailgate), చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో అట్రాక్టివ్‌గా నిలుస్తున్నాయి. బాడీవర్క్‌పై అందించిన క్రోమ్ స్కార్పియో-ఎన్ ఎక్స్‌టీరియర్ లుక్‌కు ప్రీమియం ఫీల్ తెచ్చింది. దీని ఇంటీరియర్స్ లుక్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.

మహీంద్రా స్కార్పియో (Photo: Twitter)

మహీంద్రా అధికారిక కమ్యూనికేషన్ స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. అడ్వాన్స్‌డ్‌ మోడర్న్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో స్కార్పియో-ఎన్ లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ (Petrol, Diesel engine) ఆప్షన్‌లతో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 4x4 వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇందులో లాడెర్-ఫ్రేమ్ ఛాసిస్‌ అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఎస్‌యూవీలో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, టర్బోచార్జ్డ్‌ 2.0-లీటర్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లు, మహీంద్రా బ్రాండ్ సరికొత్త లోగో, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం.

మహీంద్రా స్కార్పియో (Photo: Twitter)

కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా (Vijay nakra) ఈ కారు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఐకానిక్ బ్రాండ్‌గా స్కార్పియో మోడల్ మారిందన్నారు. ఆల్-న్యూ స్కార్పియో-ఎన్ ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బెంచ్‌మార్క్‌లను మళ్లీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిజైన్, థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్, హై-ఎండ్ టెక్నాలజీతో, మేం ఇంకా అధునాతనమైన ఎస్‌యూవీలను తయారుచేసే మహీంద్రా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

మహీంద్రా స్కార్పియో (Photo: Twitter)

"ఆల్-న్యూ స్కార్పియో-ఎన్‌తో (Mahindra Scorpio-N) 'ఎక్స్‌ప్లోర్ ది ఇంపాజిబుల్' అనే మా బ్రాండ్ వాగ్దానాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. Scorpio-N అనేది ప్రపంచ స్థాయి ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి తీసుకురావడం, మా కస్టమర్లకు చక్కటి ఓనర్ ఎక్స్పీరియన్స్ అందించడం పట్ల మా నిబద్ధతను సూచిస్తుంది" అని విజయ్ తెలిపారు. కొత్త స్కార్పియో-ఎన్ 2022 జూన్ 27న వస్తుందని మహీంద్రా పేర్కొంది. దీనర్థం థార్ & థార్ మాదిరిగానే అధికారికంగా దీని ధర వెల్లడించే అవకాశం ఉంది.

First published:

Tags: Mahindra and mahindra, New cars, Scorpio

ఉత్తమ కథలు