హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Offer: మహీంద్రా నుంచి దివాళీ ఆఫర్... ఆ మోడల్స్‌పై రూ.81,500 వరకు డిస్కౌంట్​

Mahindra Offer: మహీంద్రా నుంచి దివాళీ ఆఫర్... ఆ మోడల్స్‌పై రూ.81,500 వరకు డిస్కౌంట్​

Mahindra Offer: మహీంద్రా నుంచి దివాళీ ఆఫర్... ఆ మోడల్స్‌పై రూ.81,500 వరకు డిస్కౌంట్​
(ప్రతీకాత్మక చిత్రం)

Mahindra Offer: మహీంద్రా నుంచి దివాళీ ఆఫర్... ఆ మోడల్స్‌పై రూ.81,500 వరకు డిస్కౌంట్​ (ప్రతీకాత్మక చిత్రం)

Mahindra Diwali Offer | మహీంద్రా వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దీపావళి ఆఫర్ ప్రకటించింది కంపెనీ. ఏకంగా రూ.81,500 వరకు డిస్కౌంట్ (Festival Discount) ప్రకటించింది. ఏఏ వాహనాలపై ధర ఎంత తగ్గుతుందో తెలుసుకోండి.

దేశంలోనే అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి సందర్భంగా వాహన తయారీ సంస్థలు వరుస ఆఫర్లను (Festival Offers) ప్రకటిస్తున్నాయి. తాజాగా దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా తన మల్టీ పర్పస్ వెహికల్స్ ​(MPV), స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (SUV)పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ వాహనాలపై ఏకంగా రూ. 81,500 వరకు డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు అందజేస్తుంది. మహీంద్రా తన పాపులర్​ బొలెరో (Bolero) మోడల్​ నుండి అల్టురాస్ జీ4 వరకు అన్ని మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. మహీంద్రా అత్యంత సరసమైన మోడల్- KUV100 NXT​పై- కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ .3 వేలు, క్యాష్ డిస్కౌంట్ కింద రూ.38,055 అందజేస్తుంది.

మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ .20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .15 వేలు క్యాష్​ డిస్కౌంట్​ పొందవచ్చు. దీనితో పాటు ఈ మోడల్‌పై రూ .5 వేల విలువైన యాక్సెసరీలు, రూ.4 వేల అడిషనల్​ కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే వేరియంట్ ఆధారంగా ఈ డిస్కౌంట్లు, ప్రయోజనాల్లో స్వల్ప మార్పులుంటాయని మహీంద్రా తెలిపింది. అన్ని మహీంద్రా వాహనాల్లో కెల్లా బొలేరో మోడల్​పై అత్యంత తక్కవ డిస్కౌంట్​ ఇస్తోంది. ఈ మోడల్​పై కేవలం రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే అందజేస్తుంది.

Petrol Price: వాహనదారులకు దీపావళి గిఫ్ట్... రూ.100 లోపు దిగిరానున్న పెట్రోల్ ధర

మహీంద్రా అల్టూరాస్​ జి4పై భారీ డిస్కౌంట్​


మహీంద్రా మరాజో కొనుగోలుపై రూ .20 వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 5,200 కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు అందిస్తోంది. అయితే వేరియంట్లను బట్టి ఈ డిస్కౌంట్​లో స్పల్ప మార్పు ఉంటుందని సంస్థ పేర్కొంది. మహీంద్రా స్కార్పియోపై రూ .5 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.13,320 ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. అన్ని మహీంద్రా మోడల్స్​లో కెల్లా మహీంద్రా ఆల్టూరాస్ జి 4 పై అతిపెద్ద డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మోడల్​ను రూ. 81,500 డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ. 50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.11,500 కార్పొరేట్ బెనిఫిట్స్​, రూ .20 వేల అడిషనల్​ బెనిఫిట్​ వంటివి ప్రకటించింది.

IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ... హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో టూర్

ఇక మహీంద్రా ఇటీవల లాంఛ్ చేసిన ఎక్స్‌యూవీ700 మోడల్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మొదటి రెండు రోజులైన అక్టోబర్ 7, 8 తేదీల్లో 25,000 బుకింగ్స్ రాగా, రెండువారాల్లో 65,000 బుకింగ్స్ వచ్చాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంట్రడక్టరీ ధరలు చూస్తే మ్యాన్యువల్ వాహనానికి రూ.11.99 లక్షలు, ఆటోమెటిక్ వాహనానికి రూ.12.99 లక్షలు. ఈ ధరలు మొదటి 25,000 బుకింగ్స్‌కు మాత్రమే. ఆ తర్వాతి 25,000 వాహనాలకు రూ.50,000 ధర పెరుగుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ వాహనాల డెలివరీ అక్టోబర్ 30న, డీజిల్ వాహనాల డెలివరీ నవంబర్ చివరి వారంలో ప్రారంభం అవుతుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Mahindra and mahindra

ఉత్తమ కథలు