Business Idea: వ్యాపారం చేసే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం

Business Idea | వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: May 13, 2020, 11:52 AM IST
Business Idea: వ్యాపారం చేసే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మహిళలు సొంత వ్యాపారాల ద్వారా సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. మహిళా ఉద్యమ్ నిధి పేరుతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వహించే మహిళలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బుతో మహిళలు వ్యాపారాలు చేయొచ్చు. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్ల లోపు చెల్లించొచ్చు. ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు లేదా కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న మహిళలు ఈ స్కీమ్‌కు అర్హులు. ఆ వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం 51 శాతం కన్నా ఎక్కువ ఉండాలి. వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఈ లోన్ తీసుకోవచ్చు.

ప్రాజెక్ట్ వ్యయం రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. ప్రాజెక్ట్ కాస్ట్‌లో 25 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్రాజెక్ట్ వ్యయం రూ.10 లక్షలు అయితే అందులో 25 శాతం అంటే రూ.2.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇలా గరిష్టంగా రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ రీపేమెంట్‌పై ఐదేళ్లు మారటోరియం ఉంటుంది. అంటే... ఐదేళ్ల పాటు లోన్ చెల్లించాల్సిన అవసరం లేదు. లోన్ తీసుకున్న పదేళ్లలోపు చెల్లించాలి. మార్కెట్ రేట్‌ని బట్టి వడ్డీ రేటును స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SIDBI నిర్ణయిస్తుంది. తీసుకున్న లోన్‌పై ఏటా 1 శాతం సర్వీస్ ఛార్జీ చెల్లించాలి.

ఆటో రిపేరింగ్, సర్వీస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కేబుల్ టీవీ నెట్వర్క్, క్యాంటీన్, రెస్టారెంట్, కంప్యూటరైజ్డ్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సైబర్ కేఫ్, టెలిఫోన్ బూత్, లాండ్రీ, మొబైల్ రిపేరింగ్, జిరాక్స్ సెంటర్, టీవీ రిపేరింగ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్, సెలూన్, టైలరింగ్ లాంటి వ్యాపారాలకు ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్ ప్రారంభించింది. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ లోన్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

SBI: బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నవారికి ఎస్‌బీఐ షాక్... నేటి నుంచి కొత్త రేట్లు

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోండి ఇలా

Lockdown: లాక్‌డౌన్‌లో ఈ బిజినెస్ సూపర్ హిట్... ప్రభుత్వ సాయంతో వ్యాపారం చేయండిలా
First published: May 13, 2020, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading