హోమ్ /వార్తలు /బిజినెస్ /

MSSC vs FD: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌, బ్యాంక్ ఎఫ్‌డీలో ఏది బెస్ట్‌? ఈ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి

MSSC vs FD: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌, బ్యాంక్ ఎఫ్‌డీలో ఏది బెస్ట్‌? ఈ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి

MSSC vs FD: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌, బ్యాంక్ ఎఫ్‌డీలో ఏది బెస్ట్‌?

MSSC vs FD: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌, బ్యాంక్ ఎఫ్‌డీలో ఏది బెస్ట్‌?

MSSC vs FD: మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది తాము ఇన్వెస్ట్‌ (Invest) చేస్తున్న డబ్బుకి మంచి రాబడి అందటంతో పాటు సెక్యూరిటీ ఉండాలని భావిస్తారు. అందుకే ఎక్కువగా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposit)ను ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం (Central Government) కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌(MSSC) స్కీమ్‌ తీసుకొస్తోంది. మహిళా సాధికారత కోసం 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. కేవలం మహిళలు, బాలికల ప్రయోజనం కోసమే ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది మహిళా పెట్టుబడిదారులకు ఒన్‌ టైమ్‌ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఇందులో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌, ఎఫ్‌డీలో ఏది ఎక్కువ వడ్డీ అందిస్తుంది. మహిళలకు ఏది బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుందో పరిశీలిద్దాం.

* మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) సేవింగ్‌ స్కీమ్‌ వివరాలు

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి తర్వాత నగదు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్మాల్ సేవింగ్స్‌ స్కీమ్‌లో మహిళ లేదా బాలిక పేరిట ఇన్వెస్ట్‌ చేసిన రూ.2 లక్షల మొత్తానికి 7.5 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల సమయానికి ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది.

ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం నుంచి అవసరం మేరకు కొంత విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌ ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తోంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ముఖ్యమైన పన్ను ప్రయోజనాలను పొందుతుంది. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించిన పన్ను విధానాలపై స్పష్టత లేదు.

* మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ vs బ్యాంక్ FD వడ్డీ రేట్లు

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రస్తుతం పెద్ద బ్యాంకులు ఇస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే కనీసం 0.50– 1 శాతం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తోందని SAG ఇన్ఫోటెక్ MD, అమిత్ గుప్తా తెలిపారు. అయితే పెట్టుబడిదారులు తప్పనిసరిగా బ్యాంకు భద్రత, విశ్వసనీయతను పరిశీలించాలని చెప్పారు.

ఇది కూడా చదవండి : కర్ణాటకలో కీటకాలకు బాలీవుడ్ సినిమా క్యారెక్టర్ల పేర్లు.. భళ్లాలదేవ పేరు కూడా ఉంది!

ఆర్‌బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌, షెడ్యూల్డ్ బ్యాంకుల్లో డిపాజిట్లకు రూ.5 లక్షల వరకే హామీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిధిలోకి చిన్న ఫైనాన్సింగ్ బ్యాంకులు కూడా వస్తాయని తెలిపారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ టెన్యూర్‌ 2 సంవత్సరాలు. రెండేళ్లకే బ్యాంకులు అందిస్తున్న ఎఫ్‌డీ వడ్డీని పరిశీలిస్తే.. SBI 6.75%, యాక్సిస్ బ్యాంక్ 7.26%, HDFC 7%, ICICI 7%, కోటక్ బ్యాంక్ 6.75% చెల్లిస్తున్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ టాప్ బ్యాంక్ ఎఫ్‌డీ రేటు కంటే 0.50- 1 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2 సంవత్సరాల FDకి అధికంగా 7.5% వడ్డీ అందిస్తున్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌కు సమానంగా రాబడి ఇస్తున్నాయి. అయితే ఇందులో ప్రభుత్వ మద్దతుతో ఎలాంటి రిస్క్‌ ఉండదు.

First published:

Tags: Budget 2023, Personal Finance, Savings, Savings Deposit

ఉత్తమ కథలు