హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Scheme: మహిళలకు శుభవార్త... రేపటి నుంచి కొత్త స్కీమ్... బెనిఫిట్స్ ఇవే

New Scheme: మహిళలకు శుభవార్త... రేపటి నుంచి కొత్త స్కీమ్... బెనిఫిట్స్ ఇవే

New Scheme: మహిళలకు శుభవార్త... రేపటి నుంచి కొత్త స్కీమ్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Scheme: మహిళలకు శుభవార్త... రేపటి నుంచి కొత్త స్కీమ్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Scheme | మహిళలకు శుభవార్త. రేపటి నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం కాబోతోంది. కేవలం మహిళలు, బాలికలకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మహిళలకు శుభవార్త. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget 2023) సందర్భంగా ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (Mahila Samman Saving Certificate) స్కీమ్ 2023 ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. కేవలం మహిళల కోసం ప్రకటించిన పథకం ఇది. బాలికలు కూడా ఈ పథకంలో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Savings Scheme) మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా చేరింది. ఇందులో రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ రెండేళ్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే 2025 మార్చి వరకు ఈ పథకంలో చేరొచ్చు. మహిళలు లేదా బాలికలు రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7.5 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో రూ.2 లక్షలు పొదుపు చేస్తే 7.5 శాతం వార్షిక వడ్డీ ప్రకారం ఏటా రూ.15,000 వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కన్నా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బులు దాచుకోవాలనుకునేవారు, ఎక్కువ వడ్డీ కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పొదుపు చేయొచ్చు.

Monthly Income Scheme: ప్రతీ నెలా ఆదాయం ఇచ్చే స్కీమ్... రేపటి నుంచి డబుల్

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్న తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేయొచ్చు. అయితే ఈ పథకంలో దాచుకున్న డబ్బులకు వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాలా లేదా అన్నది తెలియాల్సి ఉంది. భారతదేశంలోని అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 1న ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

Money Rules: మీ డబ్బుపై ప్రభావం చూపే 7 మార్పులు ఇవే... ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్

ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఇందులో ప్రతీ నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ పథకంలో ఒకేసారి రూ.2 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఏటా గరిష్టంగా రూ.1,50,000 పొదుపు చేయొచ్చు. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

First published:

Tags: Personal Finance, Post office scheme, Save Money, Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు