హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance: రిలయన్స్‌పై తప్పుడు ప్రచారం తగదు.. మహారాష్ట్ర రైతు సంఘాలు

Reliance: రిలయన్స్‌పై తప్పుడు ప్రచారం తగదు.. మహారాష్ట్ర రైతు సంఘాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ సంస్థ దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడం లేదని పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత హర్జీత్ సింగ్ గ్రెవాల్ తెలిపారు. జియో టవర్లను ధ్వంసం చేస్తే.. తిరిగి ఆ భారం సామాన్యులపైనే పడుతుందని పేర్కొన్నారు.

Reliance Industries Limited (RIL): కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ శివారులో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే చట్టాల వల్ల రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుతుందని కొందరు అసత్య ప్రచారాలను చేస్తున్నారు. అంతేకాదు పంజాబ్‌, హర్యానాల్లో జియో సెల్‌టవర్లను టార్గెట్ చేసుకొని ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం స్పషమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ వంటి ప్లాన్స్ ఏవీ తమకు లేవని తెలిపింది. రైతుల సాధికారతే తమకు ముఖ్యమన్న రిలయన్స్ ఇండస్ట్రీస్... తమకు ఇలాంటి వాటిలోకి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

రిలయన్స్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మహారాష్ట్రలోని పలు రైతు సంఘాలు ఖండించాయి. కొత్త వ్యవసాయ చట్టలపై కొందరు ఉద్దేశ్వపూర్వకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మహారాష్ట్ర శెత్కారి సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్బట్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు రైతుల భూముు లాక్కుంటాయని తప్పుడు ప్రచారం చేస్తూ.. భయాందోళనలకు గురిచేస్తున్నాయని విమార్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఒక్కరి భూమినీ..ఎవరూ లాక్కోరని ఆయన స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర, పంజాబ్‌లో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతోందని.. దీని వల్ల రైతులకే లాభం చేకూరుతోందని అనిల్ చెప్పారు. మంచి ధరకే పెద్ద కంపెనీలు రైతుల ఉత్పత్తులను కొంటాయని స్పష్టం చేశారు.

రిలయన్స్ సంస్థ దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడం లేదని పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత హర్జీత్ సింగ్ గ్రెవాల్ తెలిపారు. రిలయన్స్ ప్రకటన వాస్తవమని.. రైతులను కొందరు ఉద్దేశ్వపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. జియో టవర్లను ధ్వంసం చేస్తే.. తిరిగి ఆ భారం సామాన్యులపైనే పడుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం రిలయన్స్ ఎవరితోనూ ఒప్పందాలు చేసుకోలేదని పంజాబ్ మాజీ మంత్రి సుర్జిత్ జేయాని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని బద్నాం చేసేందుకే రిలయన్స్ పేరును కొందరు వాడుకుంటున్నారని చెప్పారు.

కాగా, తాము కార్పొరేట్ ఫార్మింగ్ (కార్పొరేట్ వ్యవసాయం) కోసం ఎప్పుడూ వ్యవసాయ భూమిని కొనలేదనీ, అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం కూడా కొనలేదనీ, అలాంటి ప్లాన్స్ లేవని రిలయన్స్ సంస్థ ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు... తాము ఎప్పుడూ ఆహార ధాన్యాలను రైతులు, వారి సప్లయర్ల నుంచి డైరెక్టుగా కొనట్లేదనీ... ఏది కొన్నా కనీస మద్దతు ధర (MSP)కే కొంటున్నట్లు తెలిపింది. తక్కువ ధరలకు ఎలాంటి దీర్ఘ కాలిక ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులూ తాము కుదుర్చుకోలేదని తెలిపింది.

పంజాబ్‌లో రిలయన్స్ జియో కమ్యూనికేషన్ టవర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ... తాము ఓ రిట్ పిటిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టులో వేసినట్లు రిలయన్స్ తెలిపంది. సంస్థ ఉద్యోగులు, సంస్థ ఆస్తులకూ నష్టం జరగకుండా ఉండేలా వెంటనే ఓ సరైన ఆదేశం ఇవ్వాల్సిందిగా హైకోర్టును పిటిషన్‌లో కోరింది. ఈ దాడుల వెనక కొన్ని ప్రత్యేక శక్తులు, వ్యాపార శత్రువులు ఉన్నట్లు రిలయన్స్ ఆరోపించింది

First published:

Tags: Jio, Mukesh Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు