కేంద్రం బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పెట్రోల్ ధరల తగ్గింపు..!

మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.2.50 తగ్గించడంతో...ఆ రాష్ట్రాల్లో వీటిపై ఏకంగా రూ.5లు తగ్గనుంది.

news18-telugu
Updated: October 4, 2018, 5:42 PM IST
కేంద్రం బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పెట్రోల్ ధరల తగ్గింపు..!
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి దేశ ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. డీజిల్, పెట్రోల్‌పై రూ.2.50ల ఎక్సైజ్ డ్యూటీని తప్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. ఈ నిర్ణయంతో కేంద్రం రూ.10,500 కోట్ల మేర ఎక్సైజ్ డ్యూటీ రాబడి కోల్పోనుంది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50లు తగ్గించాలని జైట్లీ కోరారు.

ఇది కూడా చదవండి..
    Loading...
  • పెట్రోల్ ధరలు తగ్గించిన కేంద్రం.. లీటర్‌పై రూ.2.50 తగ్గింపు


జైట్లీ పిలుపు మేరకు అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలోనే నడుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, త్రిపుర, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ప్రకటించిన తగ్గింపునకు అదనంగా...పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.2.50లు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు ప్రకటించారు. దీంతో ఆ ఏడు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.5లు తగ్గనుంది. మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలోనే డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్‌ను తగ్గించాయి. మిగిలిన రాష్ట్రాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించలేమని కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇజాక్ స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి
First published: October 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...