Home /News /business /

MAHARAJA RETURNS TO TATA GROUP AFTER 69 YEARS PVN

Air India : 69 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ చేతికి మహారాజ

టాటా చేతికి ఎయిర్ ఇండియా(ఫొటో-టాటా గ్రూప్)

టాటా చేతికి ఎయిర్ ఇండియా(ఫొటో-టాటా గ్రూప్)

Air india To Tata Group : విమానయాన సంస్థ ఎయిర్ ​ఇండియా(Air India)ను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది కేంద్రం. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను గురువారం పూర్తి చేసింది. దాదాపు 7 దశాబ్ధాల తర్వాత మహారాజ (ఎయిర్​ ఇండియా) తిరిగి సొంత గూటికి చేరింది.

ఇంకా చదవండి ...
Tata Group Takes Over Air India : విమానయాన సంస్థ ఎయిర్ ​ఇండియా(Air India)ను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది కేంద్రం. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను గురువారం పూర్తి చేసింది. ఎయిర్​ఇండియాలోని 100శాతం వాటాను టాటా గ్రూప్(TATA Group)​కు చెందిన లాటెస్​ ప్రైవేట్ లిమిటెడ్​కు బదిలీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి ఎయిర్​ఇండియా నిర్వహణ, నియంత్రణ పూర్తిగా టాటా గ్రూప్​ చేతిలోనే ఉండనుంది. ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించే ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌లో 100 శాతం, ఎయిర్ ఇండియా శాట్స్ లో 50శాతం వాటా కూడా టాటా గ్రూప్ ​కు అందజేసింది కేంద్రం. దాదాపు 7 దశాబ్ధాల తర్వాత మహారాజ (ఎయిర్​ ఇండియా) తిరిగి సొంత గూటికి చేరింది.

ఈ ఒప్పందం పూర్తి కావడంపై టాటా సన్స్ ఛైర్మన్​ ఎన్ చంద్ర శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఎయిర్​ఇండియాను ప్రపంచ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ "మహారాజా"ను ఇక పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. వాస్తవానికి డిసెంబర్‌ నెలాఖరుకే ఎయిర్ ఇండియాను టాటాకు అప్పగించాల్సి ఉండింది. కానీ బ్యాలెన్స్ షీట్ ఫైనలైజ్‌ చేయడంలో జాప్యం జరిగింది. దీనికి తోడు రెగ్యులేటర్ల అనుమతులు ఆలస్యమయ్యాయి.

ALSO READ Upside down house : ఆ ఇంట్లో కొద్దిసేపు గడిపేందుకు ఎగబడుతున్న జనం..అంత ప్రత్యేకత ఏంటంటే..

ఇక,గురువారం ఉదయం ఎయిర్ ఇండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌‌ కు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. అప్పగించిన అనంతరం ఎయిర్​ ఇండియాకు కొత్త బోర్డును కూడా నియమించింది టాటా గ్రూప్​. అప్పగింతకు ముందు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎయిర్​ ఇండియా, డిపార్ట్​మెంట్​ ఆఫ్ ఇన్వెస్ట్​మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్​మెంట్​ (దీపమ్​) కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు చంద్రశేఖరన్​. ఇక ఎయిర్​ ఇండియా తిరిగి సొంత గూటికి చేరుతుండటంపై టాటా గ్రూప్​ కూడా హర్షం వ్యక్తం చేసింది. 'నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ ట్వీట్ చేసింది.


ఎయిర్ ఇండియా కొనుగోలుతో టాటా గ్రూప్​ లో మూడో విమానయాన సంస్థగా అవతరించనుంది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిర్ ఇండియా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలనే ఆలోచనతో టాటా గ్రూప్‌ ఉన్నట్లు సమాచారం.

ALSO READ Arunachal Teen : సేఫ్ గా ఇంటికి..అరుణాచల్ యువకుడిని ఆర్మీకి అప్పగించిన చైనా

కాగా,ప్రైవేటు సంస్థలను విమానయాన రంగంలోకి అనుమతించాక ఎయిర్ ఇండియా క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోసాగింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ తో విలీనం అనంతరం సంస్థకు నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ బాటపట్టింది. 2018 నుంచి ఎయిర్​ ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే తొలి ప్రయత్నంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సంస్థలో వంద శాతం వాటా విక్రయించాలని 2020లో నిర్ణయించింది. కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి గతేడాది ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రయివేట్ లిమిటెడ్ అత్యధికంగా రూ. 18వేల కోట్లకు బిడ్డింగ్ వేసి ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకుంది. విక్రయ ఒప్పందానికి గతేడాది అక్టోబరు 8న ఆమోదం తెలిపింది కేంద్రం ఎయిరిండియాలో వంద శాతం వాటా విక్రయానికి అంగీకారం తెలుపుతూ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను టాటా గ్రూప్‌కు అక్టోబర్ 11న ప్రభుత్వం జారీ చేసింది.అక్టోబరు 25 న విక్రయం ఒప్పందంపై సంతకం చేసిన కేంద్రం.. టాటాలకు అప్పగించేందుకు లాంఛనాలన్నీ పూర్తి చేసింది.

ఎయిర్ ఇండియా కోసం టాటా గ్రూప్ 100 రోజుల ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా బిగ్గ్సెట్ ఓవర్సీస్ క్యారియర్. టాటా గ్రూప్‌కు చెందిన విస్తారా డొమెస్టిక్ మార్కెట్‌లో ఇండిగో తర్వాత నెంబర్ టూగా ఉంది. ఎయిర్ ఇండియా, విస్తారాతో మార్కెట్ వాటా పెరగనుంది. విస్తారాతో పాటు ఎయిర్ ఏషియాలోను టాటాలకు మెజార్టీ వాటా ఉంది.

ALSO READ SpaceX Rocket : అప్పుడు స్సేస్ లో మిస్సింగ్..ఇప్పుడు చందమామను ఢీకొట్టేందుకు వెళ్తోంది!

కాగా,1932లో తొలిసారిగా టాటా గ్రూప్​ ఇండియాలో ఎయిర్​లైన్స్​ ను స్థాపించింది. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్​డీ టాటా ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా నడిచింది. అయితే 1953లో జాతీయీకరణలో ఎయిర్​ ఇండియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. 2007లో ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్ లైన్స్‌ను విలీనం చేశారు. ఇప్పుడు మళ్లీ టాటాల చేతికి వెళ్లింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Air India, Airlines, Ratan Tata, Tata Group

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు