Home /News /business /

Made In Telangana Mall: మేడ్ ఇన్ తెలంగాణ ఈ-మాల్.. జనవరిలో ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Made In Telangana Mall: మేడ్ ఇన్ తెలంగాణ ఈ-మాల్.. జనవరిలో ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) మరో కొత్త డిజిటల్ సేవలకు(Digital Services) శ్రీకారం చుట్టారు. లోకల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేందుకు ‘మేడ్ ఇన్ తెలంగాణ మాల్’(Made in Telangana Mall) అనే ఓ ఈ-మాల్‌ ను ఆయన ఆధ్వర్యంలో తీసుకురానున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
భారతదేశం(India)లో సాంకేతిక పరంగా బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ(Telangana) అవతరిస్తోంది. రాష్ట్రాన్ని డిజిటల్‌(Digital)గా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ సర్కార్(TRS Government) అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలతో ఐటీ(IT), మెడిసిన్(Medicine), ఎలక్ట్రానిక్(Electronic) తదితర రంగాలను విస్తరించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) నేతృత్వంలో రూపుదిద్దుకొంటున్న డిజిటల్ సేవలు(Digital Services) రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ మరో కొత్త డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టారు. లోకల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేందుకు ‘మేడ్ ఇన్ తెలంగాణ మాల్’ (Made in Telangana Mall) అనే ఓ ఈ-మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యక్తుల ఆదాయాన్ని పెంచే లక్ష్యాల్లో భాగంగా ఈ మాల్‌ను పరిచయం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారికంగా దీన్ని ప్రారంభించినప్పటికీ.. ఈ ప్లాట్‌ఫాం జనవరి నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఉత్పత్తులను ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్ముకునేందుకు (మేడ్‌ఇన్‌తెలంగాణ.లింకర్‌.స్టోర్‌) ఈ ఆన్‌లైన్ మాల్‌ దోహద పడుతుంది. ఈ మాల్‌ వేదికగా తెలంగాణలో దొరికే హస్తకళా ఉత్పత్తులు, ముత్యాలు, హోమ్ డెకరేషన్ ప్రొడక్ట్స్, ఇంకా తదితర వస్తువులను అమ్ముకోవచ్చు. అంతేకాదు ఈ మాల్ సేవలను వినియోగించుకున్నందుకు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు.
BOB Mega e-Auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం.. తక్కువ ధరకే ఇళ్లు, ఆస్తులు కొనేయండిలా..

ఆన్‌లైన్ ఎకో సిస్టం గ్లోబల్‌లింకర్‌ (GlobalLinker) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ఆన్‌లైన్ మాల్.. ప్రస్తుతం తమ ఉత్పత్తులు, సేవలను లిస్ట్ చేయాలని విక్రేతలను కోరుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ఏడు గంటల్లోనే 120 చిన్న, మధ్య తరహా సంస్థల యజమానులు ఈ మాల్‌లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఆసక్తి చూపారు. విక్రేతలు జనవరి, 2022 నెలలోగా ఆన్‌లైన్ మాల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Business Ideas: ఖర్చు లేని వ్యాపారం... కోట్లలో ఆదాయం... ఇలా ప్రారంభించండి

అనంతరం ఈ ఆన్‌లైన్ మాల్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చిన్న సంస్థలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ మాల్‌ను తీసుకొచ్చినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్‌ 17వ ఎడిషన్ "మాన్ ఎక్స్-2021" కార్యక్రమంలో కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ విక్రేతలకు కమీషన్ రహిత సేవలను అందిస్తుంది కావున వారు తమ వ్యాపారాలను పెంచుకొని ఎక్కువ లాభాలను పొందవచ్చు.
Phonepe Motor Insurance: ఫోన్‌పే నుంచి మోటార్ ఇన్సూరెన్స్.. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఆన్‌లైన్‌లోనే పాలసీ ఆఫర్

మాల్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా గ్లోబల్‌లింకర్‌ డైరెక్టర్‌ మాళవిక జగ్గీ మాట్లాడుతూ.. పోచంపల్లి చీరలు, ముత్యాలు, బిద్రీ వర్క్‌లు, వరంగల్‌ దుర్రీలు తదితర తెలంగాణ ప్రత్యేకతలపై దృష్టి సారిస్తామన్నారు. మేడ్‌ఇన్‌తెలంగాణ.లింకర్‌.స్టోర్‌ అనేది తెలంగాణ ఉత్పత్తిదారులు, విక్రేతల ఉత్పత్తులను చూపిస్తుంది. అయితే ఇది మార్కెట్‌ప్లేస్ కాదు అని ప్రజలు గమనించాలి. ఇది ఏ విధంగానూ విక్రయ ప్రక్రియలో పాల్గొనదు. ఇందులో కొనుగోలుదారులు పెట్టే ఆర్డర్ విక్రేత వెబ్ స్టోర్‌లో స్టోర్ అవుతుంది. ఏవైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే కొనుగోలుదారులు సంబంధిత విక్రేతను కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Digital Platform, KTR, Minister ktr, Telangana, Telangana Government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు