Made in India: మేడ్ ఇన్ ఇండియా సాకారం.. 5 లక్షల ఎగుమతుల మార్క్ చేరుకున్న స్కోడా కంపెనీ

Made in India: తాజాగా స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో తయారు చేసిన 5,00,000వ కారును ఎగుమతి చేసింది. ఈ 5,00,000వ మైలురాయిని అందుకున్న వాహనంగా వైట్ వోక్స్ వ్యాగన్ వెంటో (లెఫ్ట్ -హ్యాండ్ డ్రైవ్) కారుకు గుర్తింపు లభించింది.

news18-telugu
Updated: October 22, 2020, 9:05 PM IST
Made in India: మేడ్ ఇన్ ఇండియా సాకారం.. 5 లక్షల ఎగుమతుల మార్క్ చేరుకున్న స్కోడా కంపెనీ
Skoda Logo. Image used for representative purpose. (Photo: News18.com)
  • Share this:
భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో స్కోడా ఒకటి. అత్యాధునిక కార్లను మార్కెట్లో లాంచ్ చేస్తూ వాహన ప్రియుల ఆదరణ చూరగొంటుంది. తాజాగా స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో తయారు చేసిన 5,00,000వ కారును ఎగుమతి చేసింది. ఈ 5,00,000వ మైలురాయిని అందుకున్న వాహనంగా వైట్ వోక్స్ వ్యాగన్ వెంటో (లెఫ్ట్ -హ్యాండ్ డ్రైవ్) కారుకు గుర్తింపు లభించింది. కాగా ఈ కారు ముంబై నౌకాశ్రయం నుండి మెక్సికోకు రవాణా చేసిన 982 కార్లలో ఒకటిగా స్కోడా పేర్కొంది. కోవిడ్–19 విజృంభనతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ స్కోడా కంపెనీ స్థిరమైన డిమాండ్ ను నమోదు చేసింది. స్కోడా కంపెనీ ఈ ఒక్క ఏడాదిలోనే 25 వేలకు పైగా కార్లను ఎగుమతి చేయడం దీనికి ప్రధాన నిదర్శనమని చెప్పవచ్చు.

SAVWIPL మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రతాప్ బోపరాయ్ మాట్లాడుతూ “ మా కంపెనీ ఐదు లక్షల యూనిట్ల ఎగుమతిని సాధించడం గొప్ప మైల్ స్టోన్ గా భావిస్తున్నాం. భారతదేశంలోని స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ తయారీ సైట్లలో ఉత్పత్తి చేయబడిన కార్లుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ఇది భారతదేశంలో కార్ల తయారీకి మేము అనుసరించే అధిక నాణ్యత ప్రమాణాలకు గొప్ప ఉదాహరణ. కోవిడ్-19 విపత్కర పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ మేము వాహనాలను ఎగుమతిని కొనసాగిస్తూనే ఉన్నందున ఈ మైలురాయిని సులభంగా చేరుకోగలిగాం. ఇండియా 2.0 ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన ఎంబీక్యూ ఏఓ ఇన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రాబోయే సంవత్సరాల్లోనూ కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తాం.” అని అన్నారు.

స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2010లో దక్షిణాఫ్రికాకు 65 యూనిట్ల కార్లను ఎగుమతి చేయడం కోసం భారత్లో ఎక్స్పోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాతి కాలంలో దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా, సీజీజీ మరియు కరేబియన్ వంటి 61 దేశాలకు క్రమంగా తన ఎగుమతిని పెంచుకుంటోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విపత్కర మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఉత్పత్తి చేసిన కార్లలో దాదాపు 45 శాతం ఇతర దేశాలకు ఎగుమతి కావడం గొప్ప విషయంగా భావించవచ్చు. 2021లో ప్రారంభమయ్యే ఉత్పత్తులలో 95% కార్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. కాగా త్వరలోనే ఇండియన్ మార్కెట్ కోసం 4 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది స్కోడా. దీని కోసం ఎస్‌యూవీలు మరియు నాచ్‌బ్యాక్‌లతో కూడిన స్కోడా ఆటో మరియు వోక్స్‌వ్యాగన్ కార్లు అభివృద్ధి చేయనుంది.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading