Flying Car | మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ఇప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ (EV) నమూనాను తయారు చేసింది. ఇది హెలీకాప్టర్ కన్నా వేగంగా వెళ్తుందని పేర్కొంటోంది. 2017లో ఈ స్టార్టప్ ఏర్పాటు అయ్యింది. ఈ స్టార్టప్ బెంగళూరులో (Bengaluru) జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో దీన్ని ఆవిష్కరించింది. పట్టణ ప్రాంతంలో వీటి ద్వారా వేగంగా సులభంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రోటో టైప్ అనేది ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఇవీఓటీఎల్) మోడల్ ఆధారంగా పని చేస్తుంది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ఏకంగా 200 కిలోమీటర్లు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లయింగ్ ట్యాక్స్ కార్లతో పోలిస్తే.. 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుందని స్టార్టప్ పేర్కొంటోంది. అంతేకాకుండా ఉబెర్‌లో ప్రయాణంచే చార్జీలతో పోలిస్తే.. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ చార్జీలు రెండు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్లేన్ కంపెనీ సీఈవో ప్రంజాల్ మెహతా, స్టార్టప్ సీటీవో ప్రొఫెసర్ సత్య చక్రవర్తి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై తీసిన వీడియో చూస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు.
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఇలా!
ల్యాండ్ కావడానికి లేదంటే టేకాఫ్ కోసం ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి పెద్దగా స్థలం అవసరం లేదని స్టార్టప్ పేర్కొంటోంది. 25 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే సరిపోతుంది. దీన్ని పార్క్ చేసుకోవచ్చు. దీని బరువు దాదాపు 200 కేజీలు. దీనికి నాలుగు ఫ్యాన్స్ ఉంటాయి. ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 457 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.
అకౌంట్‌లోకి ఉచితంగా రూ.1,02,000 పొందండిలా, కేంద్రం అదిరే ఆఫర్!
అయితే ఇందులో బ్యాటరీ స్వాపబుల్ కాదు. అయితే కంపెనీ ఇంకా ఈ బ్యాటరీ గురించి ఇతర విషయాలను వెల్లడించలేదు. స్టార్టప్ ప్రకారం చూస్తే.. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ అనేది పట్టణాల్లో ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ మోడల్‌ను డెవలప్ చేయడానికి ఇప్లేన్ కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతానికి అయితే దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక పైలెట్ అవసరం. అయితే భవిష్యత్‌లో అటానమస్ టెక్నాలజీతో దీన్ని అప్‌డేట్ చేయనుంది. 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం రోజూ పది సార్లు ప్రయాణించేలా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని రూపొందించింది. అంటే పట్టణ ప్రాంతాల్లో జర్నీకి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ట్రాఫిక్ లేకుండా రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చు. కాగా కంపెనీ వీటిని ఎప్పటి కల్లా మార్కెట్‌లోకి తీసుకువస్తోందో కచ్చితంగా చెప్పలేదు. దీని కోసం మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Vehicle, IIT Madras, Taxi, Uber